Electric vehicles: విద్యుత్తు వాహన విక్రయాల్లో మూడింతల వృద్ధి

గత ఆర్థిక సంవత్సరం దేశంలో విద్యుత్తు వాహనాల రిటైల్‌ విక్రయాలు దాదాపు మూడింతలు పెరగడం విశేషం....

Published : 10 Apr 2022 19:24 IST

దిల్లీ: గత ఆర్థిక సంవత్సరం దేశంలో విద్యుత్తు వాహనాల (Electric Vehicles-EV) రిటైల్‌ విక్రయాలు దాదాపు మూడింతలు పెరగడం విశేషం. అత్యధికంగా ద్విచక్రవాహనాలు విక్రయమయ్యాయని వాహన పరిశ్రమ సమాఖ్య ఫాడా (FADA) తెలిపింది.

2020-21లో 1,34,821 యూనిట్ల ఈవీలు అమ్ముడు కాగా.. అవి 2021-22లో 4,29,217 యూనిట్లకు ఎగబాకాయి. 2019-20లో ఈ సంఖ్య 1,68,300 యూనిట్లుగా నమోదైంది. గత ఏడాది ప్రయాణికుల ఈవీల విక్రయాలు మూడింతలు పెరిగి 17,802కు చేరింది. ఈ విభాగంలో 15,198 యూనిట్లు విక్రయించిన దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్‌ తొలిస్థానంలో ఉంది. 2,045 యూనిట్లతో ఎంజీ మోటార్‌ ఇండియా రెండో స్థానంలో నిలిచింది. మహీంద్రా అండ్‌ మహీంద్రా, హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా తర్వాతి రెండు స్థానాల్లో ఉన్నాయి.

ద్విచక్రవాహనాలు గత ఆర్థిక సంవత్సరంలో 2,31,338 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2020-21లో అమ్ముడైన 41,046 యూనిట్లతో పోలిస్తే విక్రయాలు ఐదింతలు పెరగడం విశేషం. 65,303 యూనిట్లతో హీరో ఎలక్ట్రిక్ తొలిస్థానంలో నిలవగా.. ఒకినావా ఆటోటెక్‌ 46,447 యూనిట్లు, యాంపియర్‌ వెహికల్స్‌ 24,648, ఏథర్‌ ఎనర్జీ 19,971, ఓలా ఎలక్ట్రిక్‌ 14,371, టీవీఎస్‌ మోటార్‌ 9,458 యూనిట్లతో తరువాతి స్థానాల్లో ఉన్నాయి.

2021-22లో 1,77,874 యూనిట్ల త్రిచక్ర విద్యుత్తు వాహనాలను విక్రయించారు. వీటిలో రెండింతల వృద్ధి నమోదైంది. వాణిజ్య వాహన విక్రయాలు సైతం 400 యూనిట్ల నుంచి 2,203 యూనిట్లకు పెరిగాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు