IT Returns: మీ రిటర్నులను వెరిఫై చేశారా?

పన్ను రిటర్నులను దాఖలు చేసిన వారిలో ఇప్పటికీ కొందరు వాటిని వెరిఫై చేయలేదని ఆదాయపు పన్ను పోర్టల్‌ వెల్లడించింది.

Updated : 29 Aug 2023 07:03 IST

ఈనాడు, హైదరాబాద్‌: పన్ను రిటర్నులను దాఖలు చేసిన వారిలో ఇప్పటికీ కొందరు వాటిని వెరిఫై చేయలేదని ఆదాయపు పన్ను పోర్టల్‌ వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం 6,93,49,282 మంది రిటర్నులు దాఖలు చేశారు. ఇందులో 6,69,32,180 మంది తమ రిటర్నులను వెరిఫై చేశారు. గతంలో రిటర్నులు సమర్పించిన తర్వాత 120 రోజుల్లోగా ఇ-వెరిఫై చేయాల్సి ఉండేది. మారిన నిబంధనల ప్రకారం దీన్ని 30 రోజులకు తగ్గించారు. అంటే జులై 31 నాడు రిటర్నులు దాఖలు చేసిన వారు, ఈనెల 30లోపు వెరిఫై చేయాల్సి ఉంది. గడువు లోపు వెరిఫై చేయకపోతే.. రిటర్నులు చెల్లకుండా పోతాయి. వెరిఫై అయిన వాటిలో ఆగస్టు 26 నాటికి 5,22,15,809 రిటర్నులు ప్రాసెస్‌ చేసినట్లు పోర్టల్‌ పేర్కొంది. ప్రాసెస్‌ పూర్తయితేనే రిటర్నులు విజయవంతంగా సమర్పించినట్లు. అప్పుడే ఏదైనా రిఫండు ఉంటే పన్ను విభాగం చెల్లిస్తుంది. ఒకవేళ మీకు ఇప్పటికీ రిఫండు రాకపోతే... పన్ను పోర్టల్‌లోకి వెళ్లి, రిటర్నుల ప్రక్రియ ఏ స్థాయిలో ఉందో పరిశీలించండి. ఏదైనా నోటీసులు వచ్చాయా చూసుకుని, వాటికి సమాధానం ఇవ్వండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని