సహజవాయువు కొనొచ్చు!

పసిడి ఫిబ్రవరి కాంట్రాక్టుకు ఈవారం రూ.48,485 వద్ద గట్టి నిరోధం కన్పిస్తోంది. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.49,067 వరకు కాంట్రాక్టు వెళ్లొచ్చు. అదే  రూ.48,485 దిగువన ట్రేడయితే కొంత దిద్దుబాటుకు గురయి, రూ.47,335 వద్ద మద్దతు

Published : 06 Dec 2021 02:17 IST

కమొడిటీస్‌
ఈ వారం
బంగారం

పసిడి ఫిబ్రవరి కాంట్రాక్టుకు ఈవారం రూ.48,485 వద్ద గట్టి నిరోధం కన్పిస్తోంది. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.49,067 వరకు కాంట్రాక్టు వెళ్లొచ్చు. అదే  రూ.48,485 దిగువన ట్రేడయితే కొంత దిద్దుబాటుకు గురయి, రూ.47,335 వద్ద మద్దతు పొందుచ్చు. ఈ స్థాయినీ కోల్పోతే రూ.46,767 స్థాయికి దిగిరావచ్చు.

* ఎంసీఎక్స్‌ బుల్‌డెక్స్‌ డిసెంబరు కాంట్రాక్టు రూ.14,269 కంటే పైన కదలాడకుంటే రూ.13,997; రూ.13,866 వరకు అమ్మకాల ఒత్తిడికి లోనవ్వచ్చు.


 వెండి

వెండి మార్చి కాంట్రాక్టు రూ.62,631 కంటే పైన కదలాడితే రూ.63,305; రూ.65,094 వరకు రాణించొచ్చు


ప్రాథమిక లోహాలు

* ఎంసీఎక్స్‌ మెటల్‌డెక్స్‌ డిసెంబరు కాంట్రాక్టు రూ.16,829 కంటే పైన చలించకుంటే కొంత దిద్దుబాటు కావచ్చు.
* రాగి డిసెంబరు కాంట్రాక్టు రూ.720 దిగువన ట్రేడయితే ప్రతికూల ధోరణిలో చలించొచ్చు. ఇదే జరిగితే రూ.731 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకుని షార్ట్‌ సెల్‌ పొజిషన్లు కొనసాగించొచ్చు.
* సీసం డిసెంబరు కాంట్రాక్టుకు రూ.188 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకుని, రూ.185 సమీపంలో షార్ట్‌ సెల్‌ పొజిషన్లు తీసుకోవచ్చు.
* జింక్‌ డిసెంబరు కాంట్రాక్టును రూ.267 సమీపంలో షార్ట్‌ సెల్‌ చేయడం మంచిదే. రూ.274.35 వద్ద స్టాప్‌లాస్‌ను తప్పక పరిగణించాలి.
* అల్యూమినియం డిసెంబరు కాంట్రాక్టుకు రూ.213.55 వద్ద స్టాప్‌లాస్‌ పరిగణిస్తూ, షార్ట్‌ సెల్‌ పొజిషన్లు కొనసాగించడం మంచిదే.
* నికెల్‌ డిసెంబరు కాంట్రాక్టు రూ.1,541 కంటే దిగువన ట్రేడయితే, రూ.1,531 వరకు దిగిరావచ్చు. ఈ స్థాయినీ కోల్పోతే రూ.1,518;     రూ.1,501 వరకు దిద్దుబాటు కావచ్చు.


 ఇంధన రంగం

* సహజవాయువు డిసెంబరు కాంట్రాక్టుకు   రూ.285- 295 సమీపంలో లాంగ్‌ పొజిషన్లు తీసుకోవచ్చు. రూ.269 వద్ద స్టాప్‌లాస్‌ను తప్పక పెట్టుకోవాలి.
*ముడి చమురు డిసెంబరు కాంట్రాక్టు రూ.4,745 కంటే దిగువన ట్రేడయితే రూ.4,667 వరకు దిద్దుబాటు కావచ్చు. ఒకవేళ రూ.4,745 కంటే పైకి వెళితే రూ.5,263 వరకు పెరగొచ్చు.
* ముడి పామోలిన్‌ నూనె (సీపీఓ) డిసెంబరు కాంట్రాక్టుకు రూ.1,040 వద్ద స్టాప్‌లాస్‌ను పరిగణిస్తూ, రూ.1,105 లక్ష్యంగా, రూ.1,052 సమీపంలో లాంగ్‌ పొజిషన్లు తీసుకోవచ్చు.


 వ్యవసాయ ఉత్పత్తులు

* పసుపు డిసెంబరు కాంట్రాక్టు రూ.7,810 కంటే పైన కదలాడకుంటే రూ.7,362; రూ.7,088 వరకు దిగి రావచ్చు.
* జీలకర్ర డిసెంబరు కాంట్రాక్టు రూ.16,043 కంటే పైన కదలాడకుంటే దిద్దుబాటు కావచ్చు. తక్కువ నష్టభయంతో ట్రేడ్‌ చేసే వాళ్లు లాంగ్‌ పొజిషన్లకు దూరంగా ఉండటం మంచిది.
* పత్తి డిసెంబరు కాంట్రాక్టు రూ.31,956 కంటే పైన చలించకుంటే, రూ.30,530 లక్ష్యంతో షార్ట్‌ సెల్‌ పొజిషన్లు తీసుకోవచ్చు. 

- ఆర్‌ఎల్‌పీ కమొడిటీ అండ్‌ డెరివేటివ్స్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని