నెట్‌ఫ్లిక్స్‌ చందా ధరల తగ్గింపు

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ భారత్‌లో నెలవారీ చందా ధరలను 60 శాతం వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటింaచింది. దేశంలో ఓటీటీ విభాగంలో పోటీ పెరిగిన నేపథ్యంలో వీక్షకుల సంఖ్యను పెంచుకోవాలని సంస్థ చూస్తోంది. ఇప్పటివరకు నెట్‌ఫ్లిక్స్‌ మొబైల్‌ చందా నెలకు రూ.199 కాగా, రూ.149కు తగ్గించింది.

Published : 15 Dec 2021 04:49 IST

దిల్లీ: ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ భారత్‌లో నెలవారీ చందా ధరలను 60 శాతం వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటింaచింది. దేశంలో ఓటీటీ విభాగంలో పోటీ పెరిగిన నేపథ్యంలో వీక్షకుల సంఖ్యను పెంచుకోవాలని సంస్థ చూస్తోంది. ఇప్పటివరకు నెట్‌ఫ్లిక్స్‌ మొబైల్‌ చందా నెలకు రూ.199 కాగా, రూ.149కు తగ్గించింది. బేసిక్‌ ప్లాన్‌ ధరను నెలకు రూ.499 నుంచి రూ.199కు తగ్గించారు. స్టాండర్డ్‌ ప్లాన్‌ను రూ.649 నుంచి రూ.499కి, ప్రీమియం ప్లాన్‌ను రూ.799 నుంచి రూ.649కి తగ్గించారు. వినియోగదారులు నెట్‌ఫ్లిక్స్‌ను పెద్ద తెర లేదా నచ్చిన పరికరంపై వీక్షించాలన్న లక్ష్యంతో పథకాల ధరలు తగ్గిస్తున్నట్లు సంస్థ ఉపాధ్యక్షుడు కంటెంట్‌ (ఇండియా) మోనికా షెర్గిల్‌ తెలిపారు. 2016లో భారత్‌లో ప్రారంభమైనప్పటి నుంచి నెట్‌ఫ్లిక్స్‌ ప్రీమియం ఓటీటీ వేదికగానే ఉంది.

అమెజాన్‌ ప్రైమ్‌ ప్రియం: అమెజాన్‌ ప్రైమ్‌ సభ్యత్వ ధరలను అమెజాన్‌ ఇండియా మంగళవారం నుంచి పెంచింది. ఇప్పటి వరకు భారత్‌లో ఏడాదికి రూ.999గా ఉన్న అమెజాన్‌ ప్రైమ్‌ సభ్యత్వ ధరను 50 శాతం పెంచి రూ.1499 చేసింది. నెలవారీ సభ్యత్వ ప్లాన్‌ ధరను రూ.129 నుంచి 179కి; త్రైమాసిక ప్లాన్‌ ధర రూ.329 నుంచి రూ.459కి పెంచింది. ఇందులో కొనుగోళ్లపై రాయితీలు, ఉచిత డెలివరీ వంటి సదుపాయాలతో పాటు అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో కూడా కలిపే ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని