కొమకి విద్యుత్‌ వాహనాలు

తొలి బ్యాటరీ-పవర్డ్‌ క్రూయిజర్‌ మోటార్‌సైకిల్‌ రేంజర్‌, ఇ-స్కూటర్‌ వెనిస్‌లను దేశీయ విపణిలో విడుదల చేయనున్నట్లు కొమకి ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ సోమవారం వెల్లడించింది. రేంజర్‌ ధర రూ.1.68 లక్షలు కాగా, వెనిస్‌ ధర రూ.1.15 లక్షలు (ఎక్స్‌-

Published : 25 Jan 2022 02:39 IST

ధరల శ్రేణి రూ.1.15-1.68 లక్షలు

ముంబయి: తొలి బ్యాటరీ-పవర్డ్‌ క్రూయిజర్‌ మోటార్‌సైకిల్‌ రేంజర్‌, ఇ-స్కూటర్‌ వెనిస్‌లను దేశీయ విపణిలో విడుదల చేయనున్నట్లు కొమకి ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ సోమవారం వెల్లడించింది. రేంజర్‌ ధర రూ.1.68 లక్షలు కాగా, వెనిస్‌ ధర రూ.1.15 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌). ఈ 2 వాహనాలు ఈ నెల 26 నుంచి అన్ని కొమకి విక్రయ కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయని తెలిపింది. హరియాణా మినహా దేశంలోని అన్ని ప్రాంతాల్లో 324 విక్రయశాలలు కంపెనీ ఆధ్వర్యంలో నడుస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. ‘దేశీయంగా తొలి విద్యుత్‌ క్రూజర్‌ను తీసుకురావడంతో, చరిత్రలో మాకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉండనుంద’ని కొమకి ఎలక్ట్రిక్‌ విభాగం డైరెక్టర్‌ గుంజన్‌ మల్హోత్రా వెల్లడించారు.

రేంజర్‌ 4,000 వాట్‌ మోటార్‌ సామర్థ్యంతో రూపొందించిన క్రూజర్‌ బైక్‌. 4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఒకసారి ఛార్జింగ్‌తో 180-220 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది. బ్లూటూత్‌ సౌండ్‌ సిస్టమ్‌, సైడ్‌ స్టాండ్‌ సెన్సార్‌, క్రూజ్‌ కంట్రోల్‌, యాంటీ థెఫ్ట్‌ లాక్‌ సిస్టమ్‌, డ్యూయల్‌ స్టోరేజీ బాక్స్‌ తదితర సదుపాయాలు దీని సొంతం.

వెనిస్‌ స్కూటర్‌ 3 కిలోవాట్ల మోటార్‌, 2.9 కిలోవాట్ల బ్యాటరీతో లభ్యమవుతుంది. 9 రంగుల్లో ఈ మోడల్‌ అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని