దసరాకు సొంత 5జీ వ్యవస్థ

దేశీయంగా అభివృద్ధి చేస్తున్న 5జీ వ్యవస్థ ఈ ఏడాది అక్టోబరు (దసరా) నాటికి సిద్ధమవుతుందని కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ బుధవారం వెల్లడించారు. వ్యయం, నాణ్యత ప్రయోజనాల కోసం

Published : 19 May 2022 02:42 IST

కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి అశ్వినీ వైష్ణవ్‌  

దిల్లీ: దేశీయంగా అభివృద్ధి చేస్తున్న 5జీ వ్యవస్థ ఈ ఏడాది అక్టోబరు (దసరా) నాటికి సిద్ధమవుతుందని కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ బుధవారం వెల్లడించారు. వ్యయం, నాణ్యత ప్రయోజనాల కోసం దీనిని పరిశీలించాలని ఆయా దేశాలకు విజ్ఞప్తి చేశారు. భారత టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్‌) నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ  ఆర్థికాభివృద్ధిలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తున్న ప్రపంచంలో, డిజిటల్‌ విభజనను తగ్గించడం మరింత కీలకమని వివరించారు. దేశీయంగా అభివృద్ధి చేస్తున్న 4జీ, 5జీ వ్యవస్థల నాణ్యత బాగుంటుందని, ధర విషయంలోనూ సహేతుకంగా ఉంటుందని అంతర్జాతీయ ప్రతినిధులకు తెలిపారు. సుదూర ప్రాంతాల్లో నివసించే వారిని యూఎస్‌ఓ (యూనివర్సల్‌ సర్వీస్‌ ఆబ్లిగేషన్‌ ఫండ్‌) మద్దతుతో అనుసంధానిస్తామన్నారు. చెల్లింపులు, ఆరోగ్య సంరక్షణ, లాజిస్టిక్స్, విద్య విభాగాల్లో ఓపెన్‌ పబ్లిక్‌ డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లను తీసుకొస్తామని పేర్కొన్నారు. పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్‌ ప్లాన్‌ కింద మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో టెలికాం కార్యదర్శి కె.రాజరామన్, ట్రాయ్‌ ఛైర్మన్‌ పీడీ వాఘేలా తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని