నిర్ణయాలకు సరైన గణాంకాలు అవసరం

నిర్ణయాలు తీసుకోవడానికి, మార్కెట్‌ వర్గాల నుంచి సరైన అంచనాలు వెలువడడానికి మెరుగైన గణాంకాలు అత్యంత అవసరమని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ పేర్కొన్నారు. ‘ప్రజా విధానాల్లో గణాంకాల ప్రాధాన్యతను సరిగ్గా అర్థం చేసుకోవాలి.

Published : 30 Jun 2022 02:14 IST

ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌

ముంబయి: నిర్ణయాలు తీసుకోవడానికి, మార్కెట్‌ వర్గాల నుంచి సరైన అంచనాలు వెలువడడానికి మెరుగైన గణాంకాలు అత్యంత అవసరమని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ పేర్కొన్నారు. ‘ప్రజా విధానాల్లో గణాంకాల ప్రాధాన్యతను సరిగ్గా అర్థం చేసుకోవాలి. కరోనా తెచ్చిన తీవ్ర అనిశ్చితుల్లో మెరుగైన గణాంకాలే మంచిని చేయగలవ’ని ఆర్‌బీఐ వార్షిక ‘స్టాటిస్టిక్స్‌ డే కాన్ఫరెన్స్‌’లో ఆయన అన్నారు. ‘భారత్‌ సహా పలు దేశాల్లో విధించిన లాక్‌డౌన్‌ల వల్ల, గణాంకాల లభ్యతకు పలు సవాళ్లు ఎదురయ్యాయి. వివిధ దేశాలపై కరోనా ప్రభావం చూపింది. ఇప్పటి వరకు చూడని సమస్యకు సత్వర పరిష్కారాలను ప్రపంచం కనుగొనాల్సి వచ్చింది. తొలి దశ కరోనా సమయంలో వినియోగదారు ధరల సూచీ(సీపీఐ) గణాంకాలను ప్రచురితం చేయడానికి గణాంకాలు, పథక అమలు మంత్రిత్వ శాఖ చాలా ఇబ్బందులు పడింద’ని ఆయన గుర్తు చేశారు. ‘కరోనా పరిణామాల్లో సరికొత్త గణాంక పద్ధతులను కనుగొనాల్సి వచ్చింది. వీటి వల్ల దీర్ఘకాల ప్రయోజనాలు కలగనున్నాయి. సరికొత్త గణాంకాల నవరుల వల్ల అధికారిక గణాంకాలకు అవకాశాల గవాక్షం తెరచినట్లయింది. అయితే డేటా గోప్యత, డేటా భద్రతకు మెరుగైన సమాచార నాణ్యత అభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల’ని ఆయన అభిప్రాయపడ్డారు. సమాచారాన్ని ‘ప్రజల వస్తువు’గా ఆర్‌బీఐ భావిస్తుందని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని