రిఫండు రాలేదేమిటి?

గత ఆర్థిక సంవత్సరం 2019-20కి గాను ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు జనవరి 10 వరకూ సమయం...

Published : 08 Jan 2021 04:24 IST

గత ఆర్థిక సంవత్సరం 2019-20కి గాను ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు జనవరి 10 వరకూ సమయం ఉంది. ఇప్పటికే రిటర్నులు సమర్పించిన వారికి రిఫండూ అందుతుంది. దాదాపు రూ.1.64లక్షల కోట్లను అధికంగా పన్ను చెల్లించిన వారికి వెనక్కి ఇచ్చామని ఆదాయపు పన్ను శాఖ ప్రకటించింది. మరి రిఫండు కోసం దరఖాస్తు చేసినా ఆ మొత్తం  అందకపోతే ఏం చేయాలనేది చాలామంది సందేహం... ఇలాంటప్పుడు ఏం చేయాలంటే...

సాధారణంగా రిటర్నులు దాఖలు చేసి, దాన్ని సీపీసీ ప్రాసెస్‌ చేసిన తర్వాత 25-45 రోజుల్లో రిఫండు వస్తుంది. ఒకవేళ ఈ లోపు రిఫండు రాలేదంటే కొన్నిసార్లు మనం దాఖలు చేసిన రిటర్నులలో ఏదో పొరపాటు దొర్లిందని అర్థం.
మీరు రిటర్నులలో తెలిపిన సమాచారానికీ, ఆదాయపు పన్ను శాఖ దగ్గర ఉన్న వివరాలకూ సరిపోనప్పుడు ఇలాంటి ఇబ్బంది వస్తుంది. అనుమానాలు ఉన్నప్పుడు నివృత్తి చేసుకునేందుకు మీకు ఇ-మెయిల్‌కు సందేశాన్ని పంపిస్తుంది. ఇలా మీకేమైనా సమాచారం వచ్చిందా చూడండి.
మీరు రిటర్నులు దాఖలు చేసినప్పుడు బ్యాంకు ఖాతా వివరాలు సరిగ్గానే పేర్కొన్నారా? మరోసారి తనిఖీ చేసుకోండి. తేడా ఉంటే.. వెంటనే రివైజ్డ్‌ రిటర్నులు వేయండి.
ఇన్‌కంట్యాక్స్‌ఇఫైలింగ్‌ వెబ్‌సైటులోకి లాగిన్‌ అయ్యి.. వర్క్‌లిస్ట్‌లో.. ఫర్‌ యువర్‌ ఆక్షన్‌ను ఒకసారి పరిశీలించండి. అందులో రిఫండు క్లెయిం మీకు తెలిసిన మేరకు సరిగ్గానే ఉందా లేదా ఏదైనా పొరపాటు ఉంటే సరిచేసుకుంటారా అనే ఆప్షన్లు ఉంటాయి. అందులో సరైన ఆప్షన్‌ను ఎంచుకోండి. రిఫండులో పొరపాటు వస్తే.. రివైజ్డ్‌ రిటర్నులు వేయాలి.
పన్ను రిటర్నులు దాఖలు చేసిన వారికి ఆదాయపు పన్ను శాఖ ‘ప్రౌడ్‌ ఫైలర్‌’ పేరుతో ఒక బ్యాడ్జ్‌ను పంపిస్తోంది. దీన్ని సామాజిక వేదికల్లో మీ ఫొటోతో కలిపి వాడుకోవాల్సిందిగా సూచిస్తోంది. మీరూ దానిని ప్రయత్నించండి..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని