'కాంటాక్ట్ లెస్' కార్డులు ఎలా పనిచేస్తాయి?

మీ క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారా రూ. 2,000 కంటే తక్కువ విలువగల లావాదేవీని పూర్తి చేయడానికి కొన్నిసార్లు మీ కార్డు పిన్ నెంబర్ ను నమోదు చేయాల్సిన అవసరం ఉండదనే విషయం మీకు తెలుసా? అయితే, ఇది వైఫై సింబల్ కలిగిన కార్డుల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. వీటిని ‘కాంటాక్టులెస్’ కార్డులని కూడా పిలుస్తారు. దీనిలో నియర్..

Updated : 01 Jan 2021 15:35 IST

మీ క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారా రూ. 2,000 కంటే తక్కువ విలువగల లావాదేవీని పూర్తి చేయడానికి కొన్నిసార్లు మీ కార్డు పిన్ నెంబర్ ను నమోదు చేయాల్సిన అవసరం ఉండదనే విషయం మీకు తెలుసా? అయితే, ఇది వైఫై సింబల్ కలిగిన కార్డుల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. వీటిని ‘కాంటాక్టులెస్’ కార్డులని కూడా పిలుస్తారు. దీనిలో నియర్ ఫ్యాక్టర్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్సీ) పరిజ్ఞానాన్ని ఉపయోగించారు, టెర్మినల్ వద్ద ట్యాప్ చేసి చెల్లింపు చేయడానికి మిమల్ని ఇది అనుమతిస్తుంది. మీరు కేవలం కార్డుని పాయింట్ అఫ్ సేల్ (పీఓఎస్) మెషిన్ పై ఉంచి, చెల్లింపు చేయవచ్చు. అయితే, మీరు ఈ కార్డును పీఓఎస్ మెషిన్ కి కనీసం రెండు సెంటీ మీటర్ల దగ్గరగా ఉంచాలి. ఒకవేళ లావాదేవీ మొత్తం రూ. 2,000 కంటే ఎక్కువ ఉన్నట్లయితే, ట్యాప్ అండ్ పే ఆప్షన్ ద్వారా లావాదేవీని పూర్తి చేయలేరు.

డీయాక్టీవేట్ చేయడం కుదరదు :

ప్రస్తుతం మన దేశంలో 2 కోట్ల 80 లక్షల కంటే ఎక్కువ మందికి కాంటాక్టులెస్ వీసా కార్డులు ఉన్నాయని వీసా ఇండియా వైస్ ప్రెసిడెంట్, బిజినెస్ డెవలప్మెంట్ హెడ్ మురళీ నాయర్ తెలిపారు.

ఒక కాంటాక్టులెస్ కార్డుని ఎంచుకునే ముందు, మీరు కాంటాక్టులెస్ చెల్లింపు ఆప్షన్ ను డీయాక్టీవేట్ చేయలేరనే విషయాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే అందులో డిఫాల్ట్ గా కాంటాక్టులెస్ చిప్ ని అమర్చడం జరిగింది. దీంతో మీరు కాంటాక్టులెస్ చెల్లింపు ఆప్షన్ ను డీయాక్టీవేట్ చేయలేరని ఐసీఐసీఐ బ్యాంక్ లిమిటెడ్, అన్ సెక్యూర్డ్ ఎసర్ట్స్ & కార్డ్స్ హెడ్ సుదీప్తా రాయ్ తెలిపారు.

మోసపూరిత ప్రమాదం నియంత్రణలో ఉంటుంది :

"ఒకవేళ మీ కార్డు ఏదైనా మోసానికి గురైనప్పటికీ, మీరు పూర్తి సురక్షితంగా ఉండవచ్చు, ఎందుకంటే మీకు జరిగిన నష్టాన్ని మీ బ్యాంకు తప్పనిసరిగా కవర్ చేస్తుందని రాయ్ తెలిపారు. 2014 సంవత్సరంలో కాంటాక్టులెస్ క్రెడిట్ కార్డును ప్రవేశపెట్టినప్పటి నుంచి మోసానికి సంబంధించిన ఎలాంటి కేసులు నమోదు కాలేదని కొటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అంబుజ్ చందన తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని