విశాఖ సహా 3 క్యాన్సర్‌ ఆస్పత్రులకు ICICI Bank ₹1200 కోట్ల సాయం!

ICICI Bank: విశాఖ సహా దేశవ్యాప్తంగా మొత్తం మూడు ప్రాంతాల్లో టాటా మొమోరియల్‌ ట్రస్ట్‌ క్యాన్సర్‌ చికిత్సా కేంద్రాలను నిర్వహిస్తోంది. వీటి సామర్థ్యాన్ని విస్తరించేందుకు ఐసీఐసీఐ బ్యాంక్‌ రూ.1,200 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. 

Updated : 02 Jun 2023 14:05 IST

ముంబయి: ‘టాటా మెమోరియల్‌ సెంటర్‌ (TMC)’ తమ క్యాన్సర్‌ చికిత్సా కేంద్రాలను విస్తరించేందుకు ఐసీఐసీఐ బ్యాంక్‌ (ICICI Bank) రూ.1,200 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఐసీఐసీఐ ఫౌండేషన్‌ (ICICI Foundation) నుంచి అందనున్న ఈ మొత్తంతో నవీ ముంబయిలోని ఖర్గార్‌, పంజాబ్‌లోని ముల్లన్‌పూర్‌ సహా విశాఖపట్నంలోని క్యాన్సర్‌ చికిత్సా కేంద్రాల (cancer treating facilities) సామర్థ్యాన్ని విస్తరించనున్నారు.

ఈ మూడు కేంద్రాల్లో విస్తరించిన సదుపాయాలు 2027 నాటికి అందుబాటులోకి వస్తాయని ఐసీఐసీఐ బ్యాంక్‌ (ICICI Bank) ఛైర్మన్‌ గిరీశ్‌ చంద్ర చతుర్వేది తెలిపారు. దీంతో ఏటా 25 వేల మంది క్యాన్సర్‌ బాధితులకు సేవలందించేందుకు టీఎంసీకి అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం బ్యాంకు దగ్గర ‘కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (CSR)’ నిధి కింద రూ.500 కోట్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. రానున్న కొన్నేళ్లలో మరిన్ని నిధులు చేరతాయని వెల్లడించారు. ప్రస్తుతం తమ సీఎస్‌ఆర్‌ బడ్జెట్‌లో 25 శాతం ఆరోగ్యసంరక్షణ సేవలపై ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని