45 గంటల బ్యాటరీ లైఫ్‌తో ₹1699కే నాయిస్‌ కొత్త ఇయర్‌బడ్స్‌.. ఫీచర్లు ఇవే!

Noise Air Buds Pro SE TWS Earphones: నాయిస్‌ కొత్త ఇయర్‌బడ్స్‌ను లాంచ్‌ చేసింది. దీని ధరను రూ.1699గా నిర్ణయించింది. అమ్మకాలు ప్రారంభమయ్యాయి.

Published : 30 Sep 2023 11:52 IST

Noise Air Buds Pro SE | ఇంటర్నెట్ డెస్క్‌: ప్రముఖ వేరెబుల్స్‌ తయారీ సంస్థ నాయిస్‌ (Noise) కొత్త ట్రూ వైర్‌లెస్‌ ఇయర్‌ బడ్స్‌ను (TWS earbuds) భారత్‌లో లాంచ్‌ చేసింది. ఎంట్రీ లెవల్‌లో ఎయిర్‌ బడ్స్‌ ప్రో ఎస్‌ఈ (Noise Air Buds Pro SE) పేరిట దీన్ని తీసుకొచ్చింది. సింగిల్‌ ఛార్జ్‌తో 45 గంటల ప్లేబ్యాక్‌ టైమ్‌తో ఈ ఇయర్‌బడ్స్‌ వస్తుండడం దీని ప్రత్యేకత. ఇక దీని ధర, ఫీచర్లు చూద్దాం..

నాయిస్‌ కొత్త ఇయర్‌బడ్స్‌ ధరను రూ.1699గా కంపెనీ నిర్ణయించింది. బ్లాక్‌, గోల్డ్‌ వేరియంట్లలో లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌, నాయిస్‌ వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయొచ్చు. నేటి నుంచి (సెప్టెంబర్‌ 30) అమ్మకాలు ప్రారంభమయ్యాయి. కేస్‌తో పాటు ఇయర్‌బడ్స్‌ కూడా మెటాలిక్‌ పినిష్‌తో వస్తున్నాయి. ఇందులో 13 ఎంఎం డ్రైవర్స్‌ అమర్చారు. 30డీబీ వరకు యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ (ANC) సదుపాయం ఉంది. అలాగే ఎన్విరాన్‌మెంట్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ (ENC) సదుపాయమూ ఉంది. ఇందుకోసం క్వాడ్‌ మైక్రోఫోన్‌ సెటప్‌ ఇచ్చారు.

TCS: టీసీఎస్‌ కీలక నిర్ణయం.. ‘హైబ్రిడ్‌’కు గుడ్‌బై..!

టచ్‌ కంట్రోల్స్‌తో కాల్స్‌ లిఫ్ట్‌ చేయొచ్చు. అలాగే సిరి లేదా గూగుల్‌ అసిస్టెంట్‌ను వినియయోగించుకోవచ్చు. టచ్‌ కంట్రోల్స్‌ ద్వారా మ్యూజిక్‌తో పాటు వాల్యూమ్‌ కూడా అడ్జస్ట్‌ చేసుకోవచ్చు. ఇందులో కేస్‌ను ఒకసారి ఫుల్‌ ఛార్జి చేస్తే 45 గంటల ప్లే బ్యాక్‌ టైమ్‌ ఇస్తాయి. ఒక్కో ఇయర్‌బడ్‌ సింగిల్‌ ఛార్జ్‌తో 7.5 గంటలు పనిచేస్తాయి. కేవలం 30 నిమిషాల్లో బడ్స్‌ ఛార్జ్‌ అవుతాయి. ఇక కేస్‌ను 90 నిమిషాల్లో ఫుల్‌ ఛార్జ్‌ చేయొచ్చని కంపెనీ చెబుతోంది. ఒక్కో ఇయర్‌బడ్‌ బరువు 3.3 గ్రాములు కాగా.. కేస్‌ బరువు 33.3 గ్రాములు. ఐపీఎక్స్‌5 రేటింగ్‌తో ఇవి వస్తున్నాయి. బ్లూటూత్‌ 5.3 కనెక్టివిటీతో పనిచేస్తాయి. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ డివైజ్‌లకు వినియోగించుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని