RBI: యథాతథంగానే వడ్డీరేట్లు.. నిపుణుల అంచనా..

RBI: కీలకంగా పరిగణించే వడ్డీరేట్లను ఆర్‌బీఐ యథాతథంగానే ఉంచనున్నట్లు మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Published : 24 Sep 2023 19:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కీలకంగా పరిగణించే రెపోరేటు (Repo rate)ను ఈసారి కూడా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాా (RBI) 6.5శాతం వద్ద యథాతథంగా కొనసాగించే అవకాశం ఉందని నిపుణులు అంచనావేస్తున్నారు. రిటైల్‌ ద్రవ్యోల్బణం ( retail inflation) అధికంగా ఉండటం, రానున్న రోజుల్లో కఠిన విధాన వైఖరిని అవలంభించనున్నామని అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో వడ్డీ రేట్లు పెరగక పోవచ్చని తెలిపారు. ఒకవేళ అదే జరిగితే ఆర్‌బీఐ వరుసగా నాల్గవ సారి వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచినట్లవుతుంది.

ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ (Shaktikanta Das) నేతృత్వంలో ఆరుగురు సభ్యుల ‘ద్రవ్య పరపతి విధాన కిమిటీ (MPC)’ అక్టోబర్‌ 4-6 మధ్య సమావేశం కానుంది. సమావేశ నిర్ణయాలను 6న ప్రకటించనున్నారు. ఆర్‌బీఐ చివరి సారిగా ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఎంపీసీ భేటీలో 6.25 శాతంగా ఉన్న రెపో రేటును 6.5 శాతానికి పెంచింది. అధిక ద్రవ్యోల్బణం,  అంతర్జాతీయంగా ముడిచమురు ధరల పెంపు.. వంటి పరిణామాల కారణంగా వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పు చేయలేదు. ఈ నేపథ్యంలోనే  ద్వైమాసిక భేటీలోనూ వడ్డీ  రేట్లలో పెంపు ఉండబోదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

యాపిల్‌ యూజర్లకు కేంద్రం భద్రతాపరమైన అలర్ట్‌

జులైలో ‘వినియోగదారుల ధరల ఆధారిత ద్రవ్యోల్బణ సూచీ’ (CPI) 7.44 శాతంగా నమోదైంది. అదే ఆగస్టులో6.83 శాతానికి తగ్గింది. అయినప్పటికీ ఆర్‌బీఐ నిర్ణయించిన 6 శాతానికి కంటే ఎక్కువగానే ఉండటం గమనార్హం. అయితే ఆహార ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ, ముడిచమురు ధరలు బాగా పెరిగిన కారణంగా, ఆర్‌బీఐ వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పుచేయబోదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. రానున్న నెలల్లో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని