Apple Devices: యాపిల్‌ యూజర్లకు కేంద్రం భద్రతాపరమైన అలర్ట్‌

యాపిల్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌లలో సెక్యూరిటీ లోపాలున్నట్లు భారత ప్రభుత్వ సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ.. కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ ఆఫ్‌ ఇండియా వెల్లడించింది.

Updated : 24 Sep 2023 18:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యాపిల్‌ యూజర్లకు కేంద్రం భద్రతాపరమైన అలర్ట్‌లను జారీ చేసింది. ఐఫోన్‌ (iPhone), ఐపాడ్‌ (iPad), యాపిల్‌ వాచ్‌ (Apple Watch), మ్యాక్‌బుక్‌ (MacBook)ల ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌ (OS)తో పాటు సఫారీ బ్రౌజర్‌లో సెక్యూరిటీ లోపం ఉన్నట్లు గుర్తించామని భారత ప్రభుత్వ సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ.. కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ ఆఫ్‌ ఇండియా (CERT-In) వెల్లడించింది. దీని వల్ల హ్యాకర్లు యాపిల్‌ ఉత్పత్తుల్లోని భద్రతా పరిమితులను అధిగమించి యూజర్ల సమాచారం సేకరించే అవకాశం ఉందని హెచ్చరించింది.

యాపిల్‌ డివైజ్‌లలోని సెక్యూరిటీ, వెబ్‌కిట్‌ కాంపోనెంట్‌లలో లోపాలు ఉన్నాయి. వీటి ద్వారా సైబర్‌ నేరగాళ్లు యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే అవకాశం ఉంది. యూజర్లకు మాల్‌వేర్‌ లింక్స్‌, మెసేజ్‌లను పంపి డేటా తస్కరించే ప్రమాదం ఉంది

- ప్రకటనలో సెర్ట్‌-ఇన్‌

ఐఫోన్‌ 15 కొనబోతున్న ఎలాన్‌ మస్క్‌.. ఏం నచ్చిందో చెప్పిన బిలియనీర్‌!

మ్యాక్‌ ఓఎస్‌ వెర్షన్ - 12.7, 13.6, వాచ్‌ ఓఎస్‌ - 9.6.3, 10.0.1, ఐఓఎస్‌ వెర్షన్‌ - 17.0.1, ఐపాడ్ ఓఎస్‌ వెర్షన్ - 17.0.1 ఓఎస్‌లలో లోపాలు ఉన్నట్లు సెర్ట్‌-ఇన్‌ పేర్కొంది. వాటితోపాటు సఫారీ 16.6.1 వెర్షన్‌లో కూడా లోపం ఉంది. యూజర్లు తమ డేటాను సురక్షితంగా ఉంచేందుకు డివైజ్‌లలో లేటెస్ట్‌ వెర్షన్ ఓఎస్‌లను అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది. అయితే, ఐఫోన్‌ లేటెస్ట్‌ వెర్షన్‌ ఓఎస్‌గా ఐఓఎస్‌ 17.0.1 అందుబాటులో ఉంది. కానీ, సెర్ట్‌-ఇన్‌ పేర్కొన్న జాబితాలో ఇది కూడా ఉండటంతో, యాపిల్‌ కొత్త ఓఎస్‌ అప్‌డేట్‌ను త్వరలో విడుదల చేస్తుందని సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని