Vehicle Financing: సౌత్‌ ఇండియన్‌ బ్యాంకుతో జట్టు కట్టిన టాటా మోటార్స్‌

వాణిజ్య వాహనాల ఫైనాన్స్‌ కోసం టాటా మోటార్స్‌.. సౌత్‌ ఇండియన్‌ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంది.

Updated : 29 Apr 2024 17:41 IST

దిల్లీ: టాటా మోటార్స్‌ సోమవారం తన వాణిజ్య వాహన వినియోగదార్లు, డీలర్‌షిప్‌లకు ఫైనాన్సింగ్‌ సొల్యూషన్స్‌ అందించడానికి ప్రైవేట్‌ బ్యాంకు దిగ్గజం సౌత్‌ ఇండియన్‌ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. తమ సంస్థ వ్యాపార లక్ష్యాలను సాధించడానికి అనేక వాణిజ్య వాహనాలను నిర్వహించే యజమానులు, డీలర్‌షిప్‌లను శక్తివంతం చేయడం లక్ష్యంగా పెట్టుకుందని టాటా మోటార్స్‌ తెలిపింది. టాటా మోటార్స్‌ 1 టన్ను నుంచి 55 టన్నుల కార్గో (చిన్న, పెద్ద వాణిజ్య వాహనాలను), 10 సీట్ల నుంచి 51 సీట్ల ప్యాసింజర్‌ వాహనాలు, బస్సులను విక్రయిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని