TCS: నియామక సంస్థలపై ఐటీ దిగ్గజం చర్యలు!

తాత్కాలిక నియామకాల్లో అక్రమాలకు పాల్పడుతున్నాయనే ఆరోపణలపై 3 సిబ్బంది నియామక సంస్థలను టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) బ్లాక్‌లిస్ట్‌లో పెట్టినట్లు ఆంగ్ల పత్రికలు పేర్కొన్నాయి.

Updated : 28 Jun 2023 17:09 IST

దిల్లీ: తాత్కాలిక నియామకాల్లో అక్రమాలకు పాల్పడుతున్నాయనే ఆరోపణలపై 3 సిబ్బంది నియామక సంస్థలను టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) బ్లాక్‌లిస్ట్‌లో పెట్టినట్లు ఆంగ్ల పత్రికలు పేర్కొన్నాయి. టీసీఎస్‌లో సబ్‌కాంట్రాక్టింగ్‌, తాత్కాలిక ఉద్యోగులను నియమించే వనరుల నిర్వహణ బృందం(ఆర్‌ఎమ్‌జీ)లోని సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లను ఆయా సంస్థలు ప్రలోభ పెట్టి, తమ వ్యాపారాలు నడుపుకున్నాయన్నది ఆరోపణ. సంస్థ ప్రధాన నియామక బృందానికి ఈ వ్యవహారంతో సంబంధం లేదు. టీసీఎస్‌ మొత్తం ఉద్యోగుల సంఖ్యలో 0.5% - 1% మాత్రమే ఆర్‌ఎమ్‌జీ ద్వారా చేరినట్లు సమాచారం.

ఆర్‌ఎమ్‌జీ నుంచి నలుగురు సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లను తొలగించినట్లు తెలిపాయి. టీసీఎస్‌ సీఈఓ కె. కృతివాసన్‌, సీఓఓ నటరాజన్‌ గణపతి సుబ్రమణియన్‌లకు ఒక వేగు ద్వారా అందిన సమాచారంతో అంతర్గత దర్యాప్తు నిర్వహించగా, ఈ విషయాలు బయటపడ్డట్లు సమాచారం. ఆర్‌ఎమ్‌జీ గ్లోబల్‌ హెడ్‌ ఈఎస్‌ చక్రవర్తిని సెలవులో పంపగా.. హెచ్ఆ‌ర్‌ కంపెనీల నుంచి కమీషన్‌ తీసుకున్న మరో అధికారి అరుణ్‌ జీకేను తొలగించారని ఆయా కథనాలు పేర్కొన్నాయి. అమెరికా నుంచే ఈ అవకతవలకు పాల్పడ్డట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని