Evergreen: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. 4 సంవత్సరాల జీతం బోనస్..!
తైవాన్‌కు చెందిన షిప్పింగ్ సంస్థ తన ఉద్యోగులకు అనూహ్యమైన ఆఫర్ ఇచ్చింది. భారీ స్థాయిలో బోనస్‌లు ఇస్తోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
తైపీ: తైవాన్‌కు చెందిన ఎవర్‌గ్రీన్ మెరైన్ కార్పోరేషన్ (Taiwan's Evergreen Marine Corp) ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. భారీ స్థాయిలో బోనస్ (Bonus)లు ప్రకటించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సంవత్సరాల జీతాన్ని బోనస్‌గా ఇస్తోంది. ఈ విషయాన్ని ఆ సంస్థతో సంబంధం ఉన్నవర్గాలు వెల్లడించాయి.
తైవాన్ (Taiwan)కు చెందిన ఈ షిప్పింగ్ సంస్థ 50 నెలల జీతంతో సమానమైన బోనస్‌ను ఇస్తోంది. అంటే అది నాలుగు సంవత్సరాల జీతం కంటే ఎక్కువే. ఉద్యోగి జాబ్ గ్రేడ్, తైవాన్ ఆధారిత కాంట్రాక్టులు కలిగిన సిబ్బందికి మాత్రమే ఇది వర్తిస్తుందని ఆ వర్గాలు తెలిపాయి. ఒక ఏడాదిలో సంస్థ, ఉద్యోగి పనితీరు మీద ఆధారపడి సంవత్సరాంతపు బోనస్‌లు ఉంటాయని శుక్రవారం ఎవర్‌గ్రీన్ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే మిగతా వివరాలు ఏవీ వెల్లడించలేదు.
గత రెండు సంవత్సరాల్లో ఈ సంస్థ వ్యాపారం భారీస్థాయిలో పెరిగింది. 2022లో దీని ఆదాయం 20.7 బిలియన్ల డాలర్లకు పెరగనుందని అంచనా. 2020తో పోల్చుకుంటే అది మూడు రెట్లు అధికం. అయితే ఈ బోనస్ అదృష్టం ఉద్యోగులందరికీ దక్కడం లేదని తెలుస్తోంది. మరోవైపు గతేడాది ఈ సంస్థ పేరు ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. దీనికి చెందిన నౌక ఒకటి ఈజిప్ట్‌లోని సూయిజ్ కాలువలో అనూహ్యంగా ఇరుక్కుపోయింది. కీలకమైన, సన్నని కృత్రిమ కాలువలో కొద్దిరోజుల పాటు ఇతర నౌకల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IPL 2023: ఐపీఎల్ 2023.. ప్రారంభోత్సవంలో తమన్నా సందడి!
-
Politics News
Girish Bapat: భాజపా ఎంపీ గిరీశ్ బాపట్ కన్నుమూత.. ప్రధాని మోదీ విచారం
-
General News
TSPSC: గ్రూప్-1 ప్రిలిమ్స్ పేపర్ ఇంకెవరికైనా ఇచ్చారా?.. ముగ్గురు నిందితులను విచారిస్తున్న సిట్
-
Movies News
Chamkeela Angeelesi: యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న ‘చమ్కీల అంగిలేసి’.. ఈ వీడియోలు చూశారా..!
-
World News
Biden Vs Netanyahu: మా నిర్ణయాలు మేం తీసుకుంటాం.. అమెరికాకు స్పష్టం చేసిన ఇజ్రాయెల్
-
General News
Viveka Murder case: వివేకా హత్య కేసు విచారణకు కొత్త సిట్..