తెలంగాణలో రెండు రోడ్డు ప్రమాదాలు

తెలంగాణలో వేర్వేరు చోట్ల రెండు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఓ ఘటనలో కారు డ్రైవర్‌ నిర్లక్ష్యం ఇద్దరి ముగ్గురి బలి తీసుకుంటే.. మరో ఘటనలో ద్విచక్రవాహన

Updated : 06 Dec 2020 04:28 IST

భీంగల్‌: తెలంగాణలో వేర్వేరు చోట్ల రెండు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఓ ఘటనలో కారు డ్రైవర్‌ నిర్లక్ష్యం ముగ్గురిని బలి తీసుకుంటే.. మరో ఘటనలో ద్విచక్రవాహనదారుడి తొందరపాటు ప్రాణాల మీదకు తెచ్చింది.

నిజామాబాద్‌ జిల్లా భీంగల్‌ మండలం బడా భీమ్‌గల్‌ గ్రామంలో ఓ కారు అతివేగంగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టి హోటల్‌లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఎస్సై శ్రీధర్‌ రెడ్డి వివరాల ప్రకారం.. చెంగల్‌ గ్రామం వైపు నుంచి అతివేగంగా వచ్చిన కారు హోటల్‌లోకి దూసుకెళ్లడంతో అందులో ఉన్న తుప్పాల రాజన్న (70), భూదేవి (70)తోపాటు ద్విచక్రవాహనం ప్రయాణిస్తున్న ముగ్గురిలో వేల్పూరు మండలానికి చెందిన భూమన్న (48) మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదం నుంచి ఇద్దరు చిన్నారులు తృటి తప్పించుకున్నారు. వాహనం హోటల్లోకి దూసుకెళ్తుండగా.. కొన్ని క్షణాల ముందే చిన్నారులు పక్కకు వెళ్లడంతో ప్రమాదం తప్పింది. ప్రమాద దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ టీవీల్లో నమోదయ్యాయి.


ప్రాణాల మీదకు తెచ్చిన తొందరపాటు

మంచిర్యాల జిల్లాలో ఓ ద్విచక్రవాహనదారుడి తొందరపాటు ఇద్దరి ప్రాణాల మీదకు తెచ్చింది. తెలంగాణలోని మంచిర్యాల-బెల్లంపల్లి చౌరస్తా వద్ద ఓ లారీని బైక్‌ ఢీ కొనడంతో మహిళ తీవ్రంగా గాయపడింది. ద్విచక్రవాహనదారుడు కుడివైపునకు కదులుతుండటంతో ప్రమాదం జరిగింది. బైక్‌పై ఉన్న మహిళ కాళ్లపై నుంచి లారీ వెళ్లడంతో మహిళ తీవ్రంగా గాయపడింది. ట్రాఫిక్‌ సిగ్నల్‌ పడిన సమయంలో కొందరు నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని