ఆత్మాహుతి దాడిలో అంపైర్‌ మృతి

అఫ్గానిస్థాన్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో అంతర్జాతీయ క్రికెట్‌ అంపైర్‌ బిస్మిల్లా జాన్‌ షిన్వారి మృతిచెందారు. అఫ్గాన్‌కు

Updated : 05 Oct 2020 06:03 IST

కాబుల్‌: అఫ్గానిస్థాన్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో అంతర్జాతీయ క్రికెట్‌ అంపైర్‌ బిస్మిల్లా జాన్‌ షిన్వారి మృతిచెందారు. అఫ్గాన్‌కు చెందిన షిన్వారి పలు అంతర్జాతీయ, దేశీయ క్రికెట్‌ మ్యాచ్‌లకు అంపైర్‌గా వ్యవహరించారు. స్థానిక మీడియా వివరాల ప్రకారం.. నంగర్‌హార్‌ ప్రావిన్స్‌లోని ఘనిఖిల్‌ జిల్లా గవర్నర్‌ ఇంటివద్ద శనివారం మధ్యాహ్నం దుండగులు కారు బాంబు ద్వారా ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 15 మంది మృతిచెందగా మరో 30 మంది గాయాలపాలయ్యారు. మరణించిన వారిలో అంపైర్‌ షిన్వారి కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. నంగర్‌హార్ గవర్నర్ కార్యాలయ ప్రతినిధి ఆ ఘటనను ధ్రువీకరించారు. తుపాకులతో కొందరు దుండుగులు జిల్లా గవర్నర్‌ కాంపౌండ్‌లోకి దూసుకొచ్చేందుకు ప్రయత్నించగా వారిని సెక్యూరిటీ సిబ్బంది కాల్చి చంపారని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని