Vijayawada: ప్రాణం తీసిన ప్రేమ వ్యవహారం.. కృష్ణానదిలో దూకి బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్‌లో ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థి గుంటూరు జిల్లా తాడేపల్లి వద్ద కృష్ణానదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు

Published : 01 Jun 2023 16:38 IST

విజయవాడ: హైదరాబాద్‌లో ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థి గుంటూరు జిల్లా తాడేపల్లి వద్ద కృష్ణానదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా మోతే మండలం మాజీ ఎంపీపీ కుమారుడు లోకేశ్‌ ఈనెల 29న తాను ఇక కనిపించనని తల్లిదండ్రులకు సమాచారమిచ్చి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కృష్ణానదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

హైదరాబాద్‌ సమీపంలోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్న లోకేశ్‌.. అదే కళాశాలకు చెందిన యువతితో ప్రేమలో పడ్డాడు. కళాశాలలో యువతి ప్రేమ వ్యవహారం వల్లే ఆత్మహత్యకు పాల్పడ్డాడని అతని బంధువులు చెబుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని