Crime: ఖమ్మంలో డ్రగ్స్‌ కలకలం... హైదరాబాద్‌కు తరలిస్తూ పట్టుబడ్డ యువకులు

ఖమ్మంలో మాదక ద్రవ్యాల కలకలం రేపింది. నగరానికి చెందిన యువకుల నుంచి పది గ్రాముల డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు యువకులను

Published : 23 Jun 2022 17:06 IST

ఖమ్మం: ఖమ్మంలో మాదక ద్రవ్యాల కలకలం రేపింది. నగరానికి చెందిన యువకుల నుంచి పది గ్రాముల డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరి వద్ద డ్రగ్స్‌తో పాటు గంజాయిని గుర్తించిన పోలీసులు.. వాటిని హైదరాబాద్‌లో విక్రయించేందుకు తీసుకొచ్చినట్టు భావిస్తున్నారు. నిందితుల్లో ఒకరిపై బెంగళూరు, హైదరాబాద్‌లో కేసులు ఉన్నట్టు గుర్తించారు.  సీసీ సర్కిల్‌లో తనిఖీలు నిర్వహిస్తుండగా కారులో ఇద్దరు యువలకు మత్తు పదార్ధాలతో పట్టుబడినట్టు సూపరింటెండెంట్‌ నాగేందర్‌రెడ్డి తెలిపారు. 

‘‘నిందితుల నుంచి 10 గ్రాముల డ్రగ్స్‌, 60గ్రాముల యాష్‌ ఆయిల్‌, 1600 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని, కార్‌ సీజ్‌ చేశాం. నిందితుల్లో ఒకరికి గతంలో నేర చరిత్ర ఉంది. జీవనోపాధి కోసం బెంగళూరు వెళ్లిన అతనికి డ్రగ్స్‌ డీలర్స్‌తో పరిచయం ఏర్పడింది. కొంతకాలం అక్కడ డ్రగ్స్‌ సరఫరా చేసిన తర్వాత పోలీసులకు చిక్కాడు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు మకాం మార్చాడు. హైదరాబాద్‌లో కూడా డ్రగ్స్‌ సరఫరా కొనసాగించడంతో అతనిపై రెండు కేసులు నమోదయ్యాయి. 6 నెలల క్రితం తన స్థావరాన్ని ఖమ్మం మార్చుకున్నాడు. ఖమ్మం నుంచి కొరియర్‌, ట్రావెల్‌ సర్వీసు ద్వారా హైదరాబాద్‌కు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నాడు. పట్టుబడినవి సింథటిక్‌ డ్రగ్స్‌. వీటిని బెంగళూరు, గోవా, ముంబయి నుంచి దిగుమతి చేసుకుని ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు సరఫరా చేస్తున్నాడు. గత 6 నెలల నుంచి ఈ వ్యవహారం కొనసాగుతోంది’’ అని సూపరింటెండెంట్‌ నాగేందర్‌రెడ్డి వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని