Crime News: విజయవాడలో కుటుంబం ఆత్మహత్య కేసు.. వెలుగులోకి కీలక విషయాలు

తెలంగాణలోని నిజామాబాద్‌కు చెందిన కుటుంబం నిన్న విజయవాడలో ఆత్మహత్య చేసుకున్న కేసులో

Updated : 09 Jan 2022 14:31 IST

విజయవాడ: తెలంగాణలోని నిజామాబాద్‌కు చెందిన కుటుంబం నిన్న విజయవాడలో ఆత్మహత్య చేసుకున్న కేసులో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫైనాన్స్‌ సంస్థల వేధింపులే ఆత్మహత్యకు కారణమని ఆ కుటుంబం సూసైడ్‌ నోట్‌లో వెల్లడించింది. ఆత్మహత్యకు ముందు కుటుంబ సభ్యులు సూసైడ్‌ నోట్‌ రాశారు. ఇబ్బందులు పెట్టిన వారి వివరాలను అందులో పేర్కొన్నారు. నోట్‌తో పాటు తమను వేధించిన వారి వివరాలను సెల్ఫీ వీడియోలో చెప్పారు. ఆ వీడియోను పప్పుల సురేష్‌ తమ బంధువులకు పంపించారు. ఫైనాన్స్‌ వారి ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు.

కుటుంబం రాసిన సూసైడ్‌ నోట్‌, సెల్ఫీ వీడియోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వేధింపులకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో నలుగురి మృతదేహాలను ఉంచారు. పోస్టుమార్టం తర్వాత వైద్యులు మృతదేహాలను బంధువులకు అప్పగించనున్నారు. మరోవైపు మృతుల బంధువులు విజయవాడ ఆస్పత్రికి చేరుకున్నారు. వేధింపులే ఆత్మహత్యలకు కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు.

అప్పుల కోసం కుటుంబాన్ని వేధించిన నలుగురి పేర్లను పోలీసులు రికార్డులో నమోదు చేశారు. దుర్గమ్మ దర్శనానికి వెళ్లిన నిజామాబాద్‌కు చెందిన పప్పుల సురేష్‌ (58), ఆయన భార్య శ్రీలత (54), కుమారులు అఖిల్‌ (26), ఆశిష్‌ (24) నిన్న బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని