
Fire Accident: సికింద్రాబాద్ క్లబ్లో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం
హైదరాబాద్: నగరంలోని సికింద్రాబాద్ క్లబ్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఇవాళ తెల్లవారుజామున 3 గంటల సమయంలో క్లబ్లో మంటలు చెలరేగాయి. మంటలు ఎగిసిపడటంతో క్లబ్ పూర్తిగా దగ్ధమైంది. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 10 అగ్నిమాపక యంత్రాల ద్వారా దాదాపు 3 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.20 కోట్ల మేర ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. సంక్రాంతి సందర్భంగా నిన్న క్లబ్ తెరవకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. క్లబ్లో అగ్నిప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
బ్రిటీష్ హయాంలో మిలిటరీ అధికారుల కోసం 1878లో క్లబ్‌ను నిర్మించారు. దాదాపు 20 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం జరిగింది. ఈ క్లబ్‌ను భారతీయ వారసత్వ సంపదగా గుర్తించి 2017లో పోస్టల్ కవర్ కూడా విడుదల చేశారు. ఈ క్లబ్లో దాదాపు 300 మంది సిబ్బంది పని చేస్తున్నారు. క్లబ్లో 5వేల మందికిపైగా సభ్యత్వం ఉంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.