Accident: ఆంధ్రా ట్రావెల్స్ బస్సు, లారీ ఢీ.. నలుగురి మృతి
తమిళనాడు పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అందులో ఇద్దరు ఆంధ్రాకి చెందిన వారున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రా ట్రావెల్స్‌బస్సు, లారీ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
చెన్నై: తమిళనాడు- ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతం పొన్నేరి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (RoadAccident) జరిగింది. ఆంధ్రా ట్రావెల్స్ బస్సు, లారీ ట్యాంకర్ ఢీకొని బస్సు క్లీనర్‌తో పాటు మరో ముగ్గురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ (Hyderabad) నుంచి చెన్నై(Chennai) వెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు. బస్సు క్లీనర్ శ్రీధర్, నెల్లూరు జిల్లా విడవలూరుకు చెందిన తోకల సతీశ్ కుమార్, బెంగళూరుకు చెందిన తుమ్మల రోహిత్ ప్రభాత్ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద జరిగిన ప్రాంతానికి దాదాపు కిలోమీటరు ముందు చెన్నై వెళ్లేందుకు బస్సు ఎక్కిన తమిళనాడు ఆర్టీసీ డ్రైవర్ జానకి రామ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదంలో మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న తమిళనాడు పోలీసులు క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
KS Bharat: రాకెట్ స్పీడ్‌తో ఇక్కడికి చేరుకోలేదు.. ద్రవిడ్ ప్రభావం చాలా ఉంది: భరత్
-
Movies News
Sridevi: ‘ది లైఫ్ ఆఫ్ ఎ లెజెండ్’ పేరుతో శ్రీదేవి జీవిత చరిత్ర
-
Crime News
Crime News: విషాదం.. మంటల్లో నలుగురు చిన్నారుల సజీవ దహనం
-
Sports News
IND vs AUS: లంచ్ బ్రేక్.. అర్ధశతకం దిశగా లబుషేన్.. ఆసీస్ స్కోరు 76/2 (32)
-
World News
Biden: జిన్‌పింగ్‌కు పరిమితులు తెలుసు..: బైడెన్
-
World News
Earthquake: చేజారిన ఆ 72 గంటలు.. తుర్కియే, సిరియాల్లో భారీగా పెరగనున్న మృతులు..!