
Published : 10 Apr 2020 01:24 IST
10 మంది కజకిస్థాన్ దేశస్థులపై కేసు నమోదు
సత్తెనపల్లి: ఇస్లాం మత ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లా సత్తెనపల్లికి వచ్చి స్థానిక పెద్దమసీదులో ఉంటున్న కజకిస్థాన్ దేశస్థులు 10 మందిపై కేసు నమోదు అయింది. పట్టణ వీఆర్వో తోటా శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ ఎస్.విజయ్‌చంద్ర తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిన ఈ బృందం గతనెలలో సత్తెనపల్లికి వచ్చారు. లాక్‌డౌన్ అమల్లోభాగంగా ఇక్కడే ఉండిపోయారు. ఈ బృందం దిల్లీలోని నిజాముద్దీన్‌లో తబ్లీగీ జమాత్‌కు వెళ్లలేదన వారు చెబుతున్నారు. అయితే టూరిస్టు వీసా నిబంధనలు ఉల్లంఘించడంతోపాటు కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సమూహంగా వీరు తిరుగుతున్నారన్న కారణంతో కేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు. మసీదులోనే వారిని క్వారంటైన్‌లో ఉంచినట్లు సీఐ వెల్లడించారు.
Tags :