పాతకక్షలే ప్రాణం తీశాయ్‌

పాతకక్షల కారణంగానే మండలంలోని ఆరికతోటకు చెందిన వర్రి చిన్నోడు హత్యకు గురయ్యాడని పోలీసులు తేల్చారు. డీఎస్పీ మోహన్‌రావు వివరాల ప్రకారం.. 2021 సెప్టెంబరులో యువతి విషయంలో స్థానికంగా ఉంటున్న ఓ కులస్థుల మధ్య తగాదా జరిగి,

Updated : 05 Jul 2022 06:44 IST

హత్య కేసులో ఐదుగురి అరెస్టు

వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ మోహన్‌రావు

రామభద్రపుర, న్యూస్‌టుడే: పాతకక్షల కారణంగానే మండలంలోని ఆరికతోటకు చెందిన వర్రి చిన్నోడు హత్యకు గురయ్యాడని పోలీసులు తేల్చారు. డీఎస్పీ మోహన్‌రావు వివరాల ప్రకారం.. 2021 సెప్టెంబరులో యువతి విషయంలో స్థానికంగా ఉంటున్న ఓ కులస్థుల మధ్య తగాదా జరిగి, రెండు వర్గాలుగా విడిపోయారు. ఆ ఘర్షణలో చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి పగతో చివరికి హత్య చేయడానికి కూడా వెనకాడలేదు. ఈనెల 1న రాత్రి వర్రి చిన్నోడు ఇంటి నుంచి పనిమీద బయటికి వచ్చిన సమయంలో ప్రధాన రహదారిపై ఐదుగురు వ్యక్తులు కత్తులు, ఇనుప రాడ్లు, సుత్తులతో దాడిచేసి.. చనిపోయేంత వరకు కొట్టి, పరారయ్యారు. ఆరికతోట గ్రామానికి చెందిన వర్రి శివుడు ఆదివారం కత్తితో లొంగిపోయాడు. మిగిలిన నలుగురు వర్రి బాల, కర్రి శంకరరావు, కర్రి శ్రీను, కర్రి మహేష్‌ను పోలీసులు సోమవారం పట్టుకున్నారు. తామే హత్య చేసినట్లు నిందితులు అంగీకరించారు. ఈమేరకు వారిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. నాలుగు రోజుల్లో కేసును ఛేదించిన సిబ్బందిని ఆయన అభినందించారు. సీఐ శోభన్‌బాబు, ఎస్సై కృష్ణమూర్తి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని