Andhra News: తుప్పలకు నిప్పు పెట్టిన ఓ రైతు.. రహస్యంగా దాచిన నగదు బుగ్గి

చెరువు గట్టుపైనున్న తుప్పలు కాల్చేందుకు ఓ రైతు పెట్టిన మంటలు వ్యాపించడంతో సమీప పొలాల్లోని ధాన్యం బస్తాలు, నగదు కాలిపోయిన సంఘటన పార్వతీపురం మన్యం జిల్లాలోని బలిజిపేట మండలంలో జరిగింది.

Updated : 04 Feb 2023 08:37 IST

బలిజిపేట, న్యూస్‌టుడే: చెరువు గట్టుపైనున్న తుప్పలు కాల్చేందుకు ఓ రైతు పెట్టిన మంటలు వ్యాపించడంతో సమీప పొలాల్లోని ధాన్యం బస్తాలు, నగదు కాలిపోయిన సంఘటన పార్వతీపురం మన్యం జిల్లాలోని బలిజిపేట మండలంలో జరిగింది. బాధితుల వివరాల మేరకు.. తుమరాడ గ్రామంలోని కృష్ణసాగరం ఒడ్డున శుక్రవారం ఓ రైతు నిప్పు పెట్టారు. మధ్యాహ్నానికి మంటలు పక్కనున్న పొలాల్లోకి వ్యాపించాయి. ప్రమాదంలో మిర్తివలసకు చెందిన గండబోను సింహాచలం, తుమరాడకు చెందిన దాసరి మజ్జయ్య, పడాల అప్పయ్య, విమల, సత్యనారాయణ తదితరులు 17 మందికి చెందిన సుమారు రూ.8లక్షల విలువైన 370 బస్తాల ధాన్యం కాలిబూడిదైంది. చిరు వ్యాపారి గండబోను సింహాచలం తుమరాడకు చెందిన రైతుల వద్ద వంద బస్తాల ధాన్యం కొని పొలాల్లోనే ఉంచారు. రైతులకు నగదు చెల్లించేందుకు శుక్రవారం బలిజిపేటలోని వివిధ బ్యాంకులకు వెళ్లి రూ.2లక్షల నగదు తెచ్చుకున్నారు. గ్రామానికి సమీపంలో ఉండగా ఆయన ధాన్యం బస్తాలు కాలిపోయినట్లు సమాచారం అందడంతో వెంటనున్న మొత్తం నగదును తుప్పల్లో రహస్యంగా ఉంచి వెళ్లారు. మంటలు ఆ ప్రాంతానికీ వ్యాపించి నగదు కాలిపోయి బోరుమన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని