డ్రగ్స్‌ రవాణా కేసులో సినీ నిర్మాత అరెస్టు

మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న జాఫర్‌ సాదిక్‌ను నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) అరెస్టు చేసింది.

Published : 10 Mar 2024 05:14 IST

చెన్నై (ప్యారిస్‌), న్యూస్‌టుడే: మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న జాఫర్‌ సాదిక్‌ను నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) అరెస్టు చేసింది. డీఎంకే పార్టీ మాజీ నేత, సినీ నిర్మాత అయిన నిందితుణ్ని రాజస్థాన్‌లోని జైపుర్‌లో అదుపులోకి తీసుకున్నట్లు శనివారం వెల్లడించింది. దిల్లీలోని ఓ గోదాములో మత్తుపదార్థాల రవాణా ముఠా ఉన్నట్లు సమాచారం అందడంతో ఫిబ్రవరి 15న ఎన్‌సీబీ దాడిచేసి ముగ్గురిని అరెస్టు చేసింది. డ్రగ్స్‌ తయారీకి ఉపయోగించే 50 కిలోల ముడిపదార్థాన్ని స్వాధీనం చేసుకుంది. దీని వెనుక ఉన్నది జాఫర్‌ అని  అప్పట్లోనే గుర్తించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు