నీట్‌ బాగా రాయలేదని విద్యార్థి ఆత్మహత్య

నీట్‌ బాగా రాయలేదని ఓ విద్యార్థి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని గలియాబాయి తండాలో చోటు చేసుకుంది.

Published : 07 May 2024 06:22 IST

ఇంద్రవెల్లి, న్యూస్‌టుడే: నీట్‌ బాగా రాయలేదని ఓ విద్యార్థి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని గలియాబాయి తండాలో చోటు చేసుకుంది. తండాకు చెందిన ఓ విద్యార్థి(17) ఇటీవల ఇంటర్‌లో 894 మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు. జిల్లా కేంద్రంలో ఆదివారం నీట్‌ రాసి వచ్చినప్పటి నుంచి దిగులుగా ఉన్నాడు. సోమవారం మధ్యాహ్నం చదువుకుంటానని తన గదిలోకి వెళ్లి ఉరేసుకున్నాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సునీల్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని