ఆస్ట్రేలియాలో కత్తితో దాడి.. హరియాణా యువకుడి మృతి

ఆస్ట్రేలియాలో కత్తిపోటుకు గురై భారత్‌కు చెందిన ఎంటెక్‌ విద్యార్థి నవజీత్‌ సంధు (22) మృతిచెందాడు. ఇతడు హరియాణాలోని కర్నాల్‌ ప్రాంతానికి చెందినవాడు. మెల్‌బోర్న్‌లో శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు.

Published : 07 May 2024 06:25 IST

భారత విద్యార్థుల ఘర్షణలో దారుణం

మెల్‌బోర్న్‌/చండీగఢ్‌: ఆస్ట్రేలియాలో కత్తిపోటుకు గురై భారత్‌కు చెందిన ఎంటెక్‌ విద్యార్థి నవజీత్‌ సంధు (22) మృతిచెందాడు. ఇతడు హరియాణాలోని కర్నాల్‌ ప్రాంతానికి చెందినవాడు. మెల్‌బోర్న్‌లో శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. భారత విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో నవజీత్‌ ప్రాణాలు కోల్పోయాడని సమీప బంధువైన ఆర్మీ ఉద్యోగి యశ్‌వీర్‌ వెల్లడించారు. అద్దె విషయంలో భారత్‌కు చెందిన కొందరు విద్యార్థులు ఘర్షణ పడుతుండగా.. వారించేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయాడన్నారు. ఈ కేసులో నిందితులైన భారతీయ సోదరులు అభిజీత్‌ (26), రాబిన్‌ గార్టన్‌ (27) కోసం పోలీసులు గాలిస్తున్నారు. వీరు కూడా హరియాణాలోని కర్నాల్‌ ప్రాంత వాసులే. అపహరించిన టయోటా కారులో ఇద్దరూ పరారైనట్లు పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని