GHMC: హైదరాబాద్‌లో భారీ వర్షం.. నాలాలో పడి జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్యకార్మికురాలి మృతి
జీహెచ్‌ఎంసీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తోన్న మహిళ గురువారం సాయంత్రం సికింద్రాబాద్ మెట్టుగూడ బావి వద్ద నాలాలో గల్లంతైంది.
హైదరాబాద్: జీహెచ్‌ఎంసీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తోన్న మహిళ గురువారం సాయంత్రం సికింద్రాబాద్ మెట్టుగూడ బావి వద్ద నాలాలో గల్లంతైంది. ఏకధాటిగా కురిసిన వర్షం కారణంగా బ్రిడ్జి కింద నుంచి వెళ్లే ప్రయత్నంలో ప్రమాదవశాత్తూ నాలాలో పడిపోయింది. నాలా ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో అందులో కొట్టుకుపోయి.. అంబర్ నగర్ వద్ద విగతజీవిగా తేలింది. నాలాలో పడిన వెంటనే ఆమెను రక్షించేందుకు స్థానికులు ప్రయత్నించినప్పటికీ.. ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో కాపాడలేకపోయారు. ఘటనా స్థలికి చేరుకున్న చిలకలగూడ పోలీసులు, జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఆమె మృతదేహాన్ని బయటకు తీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


తాజా వార్తలు (Latest News)
-
ఏపీకి తుపాను ముప్పు
-
Cyber Attack: అమెరికా ఆస్పత్రులపై సైబర్ దాడి.. నిలిచిపోయిన వైద్య సేవలు
-
Rishab Shetty: అది చాలా బాధాకరం: ఓటీటీ సంస్థలపై రిషబ్ శెట్టి
-
Salaar: అందుకు వారికి సారీ.. ‘సలార్’ రూమర్స్‌పై ప్రశాంత్ నీల్ క్లారిటీ
-
Crime News: కాల్పులకు తెగబడినా.. చీపురు కర్రతో తరిమికొట్టిన మహిళ..!
-
Social Look: చీరలో మాళవిక హొయలు.. జాక్వెలిన్ ట్రిప్