టమాటా పెట్టెల చాటున తెలంగాణ మద్యం రవాణా

తెలంగాణ నుంచి భారీ మొత్తంలో మద్యం అక్రమ రవాణా చేస్తున్న నిందితులను స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(సెబ్‌) పోలీసులు అరెస్టు చేశారు.

Published : 01 May 2024 05:33 IST

6,376 సీసాలు స్వాధీనం

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: తెలంగాణ నుంచి భారీ మొత్తంలో మద్యం అక్రమ రవాణా చేస్తున్న నిందితులను స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(సెబ్‌) పోలీసులు అరెస్టు చేశారు. దీనివెనుక రాజకీయ నాయకుల హస్తం ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మంగళవారం గుంటూరు జిల్లా పోలీసు కార్యాలయంలో నిందితుల వివరాలను సెబ్‌ ఏఎస్పీ వెంకటేశ్వరరావు వెల్లడించారు. గుంటూరుకు చెందిన రామమోహన్‌రావు, తుళ్లూరుకు చెందిన పూర్ణచంద్రరావు తెలంగాణ నుంచి మద్యం తెచ్చి ఇక్కడ అమ్ముకోవాలని భావించారు. రామమోహన్‌రావు తన లారీలో సహచరుడు శ్రీనివాసరావును తీసుకొని తెలంగాణ వెళ్లారు. అక్కడ మద్యం కొనుగోలు చేసి లారీలో టమాటా పెట్టెలు పెట్టి.. వాటిచాటున మద్యం సీసాలు అమర్చుకొని వచ్చారు. రామమోహన్‌రావు గతంలోనూ మద్యం అక్రమ రవాణా కేసుల్లో ఉన్నాడు. దీంతో ఆయనకి ప్రధాన రహదారులపై పోలీసుల తనిఖీలు ఉంటాయని భావించి గ్రామీణ రోడ్ల మీదుగా రవాణా చేస్తున్నాడు. ప్రత్తిపాడు సెబ్‌ సీఐ మాధవికి వచ్చిన సమాచారంతో గత నెల 28న రాత్రి.. అధికారులు, సిబ్బంది వట్టిచెరుకూరు మండలం అనంతవరప్పాడు వద్ద నిఘాపెట్టారు. లారీని ఆపి తనిఖీ చేస్తుంటే టమాటా రవాణా చేస్తున్నామంటూ బుకాయించారు. లోతుగా తనిఖీ చేయడంతో మద్యం బయటపడింది. లారీలోని 133పెట్టెల్లో ఉన్న రూ.8.02లక్షల విలువైన 6,376 మద్యం సీసాలను జప్తు చేశామన్నారు. రామమోహన్‌రావు, శ్రీనివాసరావులను అరెస్టు చేశామని.. పూర్ణచంద్రరావుతోపాటు తెలంగాణలో మద్యం అమ్మిన హనుమంతరావునూ అరెస్టు చేయాల్సి ఉందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని