Madhapur Drugs Case: నటుడు నవదీప్‌ను ప్రశ్నిస్తున్న నార్కోటిక్స్‌ పోలీసులు

మాదాపూర్ డ్రగ్స్ కేసులో సినీ నటుడు నవదీప్‌ నార్కోటిక్స్‌  పోలీసుల విచారణకు హాజరయ్యాడు.

Updated : 23 Sep 2023 13:29 IST

హైదరాబాద్‌: మాదాపూర్ డ్రగ్స్ కేసులో సినీ నటుడు నవదీప్‌ నార్కోటిక్స్‌  పోలీసుల విచారణకు హాజరయ్యాడు. డ్రగ్స్ విక్రేత రామచందర్‌తో ఉన్న లింకులపై నవదీప్‌ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇవాళ తమ ముందు హాజరుకావాలని నవదీప్‌కు నార్కోటిక్స్‌ పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్‌ను నిందితుడిగా పోలీసులు చేర్చారు. అతడిని డ్రగ్స్ వినియోగదారుడిగా పేర్కొన్న పోలీసులు.. ఎవరెవరి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నాడనే కోణంలో ప్రశ్నిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని