Updated : 22 Jan 2022 17:20 IST

TS news : డిపాజిట్ల కుంభకోణం.. మరోసారి మస్తాన్‌వలీ అరెస్టు

హైదరాబాద్‌ : తెలుగు అకాడమీ డిపాజిట్ల కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు యూనియన్ బ్యాంక్ మేనేజర్ మస్తాన్ వలీని పోలీసులు మరోసారి అరెస్టు చేశారు. మస్తాన్‌వలీకి నాంపల్లి కోర్టు బెయిల్‌ మంజూరు చేయగా.. జైలు నుంచి విడుదలైన వెంటనే మరో కేసులో సీసీఎస్‌ పోలీసులు అతడ్ని అరెస్టు చేశారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థలోనూ రూ.4 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల సొమ్ము కాజేసేందుకు మస్తాన్‌వలీ కుట్ర పన్నారని పోలీసులు అభియోగం మోపారు. ఈ మేరకు వివరాలను సీసీఎస్‌ జాయింట్‌ సీపీ మీడియాకు వెల్లడించారు. తెలుగు అకాడమీ కేసు నిందితుల నుంచి రూ.2 కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు.‘‘ కాజేసిన సొమ్ముతో నిందితులు ఆస్తులు కొన్నారు. నిందితులు కొనుగోలు చేసిన ఫ్లాట్లు, భూములు స్వాధీనం చేసుకున్నాం. మరిన్ని స్థిరాస్తులపై ఇంకా వివరాలు సేకరిస్తున్నాం’’ అని సీపీ వెల్లడించారు. ప్రభుత్వ సంస్థలు తమ ఎఫ్‌డీల గురించి బ్యాంకుల్లో తెలుసుకోవాలని కోరారు.

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని