Nizamabad: ఏటీఎం సీసీ కెమెరాలపై స్ప్రే.. రూ.25 లక్షలు చోరీ

నిజామాబాద్‌ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో బస్టాండ్ సమీపంలోని ఎస్‌బీఐ ఏటీఎంను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసి రూ.25 లక్షలు దోచుకెళ్లారు.

Updated : 14 Mar 2024 13:58 IST

రుద్రూర్: నిజామాబాద్‌ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో బస్టాండ్ సమీపంలోని ఎస్‌బీఐ ఏటీఎంను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసి రూ.25 లక్షలు దోచుకెళ్లారు. పోలీసుల కథనం ప్రకారం.. బుధవారం అర్ధరాత్రి బొలెరో వాహనంలో నలుగురు దుండగులు మాస్కులు ధరించి వచ్చారు. అక్కడ తమ ఫుటేజ్‌ రికార్డు కాకుండా ఇరువైపులా ఉన్న సీసీ కెమెరాలపై స్ప్రే చేశారు. అనంతరం ఏటీఎంను ధ్వంసం చేసి రూ.25 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. ఏటీఎం విడిభాగాలను బయట పడేశారు. సమాచారం తెలుసుకున్న రుద్రూర్‌ సీఐ జయేశ్ రెడ్డి, బోధన్‌ ఏసీపీ శ్రీనివాస్‌, పోలీసు సిబ్బంది, క్లూస్‌ టీమ్‌ వచ్చి ఘటనాస్థలిని పరిశీలించారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని