Adibatla Kidnap case: యువతి ఇంటిపై దాడి చేయడం తప్పే.. కానీ..: నవీన్‌రెడ్డి తల్లి నారాయణమ్మ

ఆదిభట్ల కిడ్నాప్‌ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న నవీన్‌రెడ్డి తండ్రి కోటిరెడ్డి అనారోగ్యానికి గురయ్యారు. కుటుంబసభ్యులు ఆయనను ఆస్పత్రిలో చేర్చారు. ఇంట్లో ఉన్న నవీన్‌రెడ్డి తల్లి నారాయణమ్మ సైతం అస్వస్థతకు గురయ్యారు.

Updated : 10 Dec 2022 14:29 IST

హైదరాబాద్‌: ప్రేమించిన అమ్మాయి మరొకరితో పెళ్లికి సిద్ధపడిందని ఆ యువతిని ప్రియుడు అపహరించుకుపోయిన సంఘటన రాష్ట్ర రాజధాని శివారు మన్నెగూడలో శుక్రవారం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై యువతి తండ్రి దామోదర్‌రెడ్డి ఫిర్యాదుతో ఆదిభట్ల పీఎస్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న నవీన్‌రెడ్డి తండ్రి కోటిరెడ్డి అనారోగ్యానికి గురయ్యారు. కుటుంబసభ్యులు ఆయనను ఆస్పత్రిలో చేర్చారు. ఇంట్లో ఉన్న నవీన్‌రెడ్డి తల్లి నారాయణమ్మ సైతం అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఘటన గురించి తెలుసుకున్నప్పటి నుంచి ఆమె ఆహారం తీసుకోవడం లేదు. 

అనంతరం నారాయణమ్మ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నా కుమారుడు ఎంతో కష్టపడి జీవితంలో పైకొచ్చాడు. నా కొడుకు, ఆ యువతి రెండేళ్లుగా స్నేహంగా ఉన్నారు . ఆ అమ్మాయి చాలాసార్లు మా ఇంటికి వచ్చింది. కరోనా సమయంలో అమ్మాయిని నిత్యం కారులో కళాశాల వద్ద నా కొడుకే దింపేవాడు. యువతిని పెళ్లి చేసుకున్నట్లు నవీన్ మాకు చెప్పాడు. నవీన్ రెడ్డి తన వ్యాపారానికి సంబంధించిన డబ్బులు సైతం యువతి తండ్రి దామోదర్ రెడ్డికి ఇచ్చేవాడు. నిన్న యువతి ఇంటిపై దాడి చేయడం తప్పే. కానీ, అంతకుముందు జరిగిన విషయాలను పోలీసులు పరిగణనలోకి తీసుకోవాలి. నవీన్ రెడ్డి వ్యాపారం కోసం చాలా కష్టపడేవాడు. ఒక్కోసారి పది రోజులు కూడా ఇంటికి వచ్చేవాడు కాదు. అంత కష్టపడి పైకి ఎదిగిన నా కుమారుడిని యువతి ఎంతో ఇష్టపడింది’’ అని నారాయణమ్మ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని