Crime news: నిందితుడిని పట్టుకునేందుకు వెళ్తే.. పోలీసులపై గ్రామస్థుల రాళ్లదాడి!

ఓ మేకల దొంగను అదుపులో తీసుకునేందుకు వెళ్లిన పోలీసులపై రాళ్ల దాడి జరిగింది. తొమ్మిది మంది సిబ్బందికి గాయాలయ్యాయి.

Published : 16 Aug 2023 02:03 IST

జైపుర్‌: మేకల చోరీకి యత్నించిన ఓ నిందితుడిని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసు బృందానికి ఊహించని అనుభవం ఎదురైంది. గ్రామస్థులంతా ఏకమై వారిపై రాళ్లదాడికి దిగడంతో.. తొమ్మిది మంది సిబ్బందికి గాయాలయ్యాయి. బాధితుల్లో ఏఎస్సై కూడా ఉన్నారు. రాజస్థాన్‌ (Rajastha)లో ఈ ఘటన చోటుచేసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం.. ఇక్కడి సాలుంబర్‌ జిల్లాలోని ఇంటాలీ గ్రామంలో ఐదుగురు వ్యక్తులు మేకల చోరీకి యత్నిస్తూ గ్రామస్థుల కంటపడ్డారు. వెంటనే అప్రమత్తమైన వారు నిందితులను వెంబడించారు. ఈ క్రమంలో నలుగురు తప్పించుకోగా.. ఒకడు దొరికిపోయాడు. అతడిని చితకబాది పంచాయతీ కార్యాలయంలో బంధించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ నిందితుడిని పట్టుకునేందుకు గ్రామానికి చేరుకున్నారు.

తల కోసుకుని.. దేవుడి కోసం ఆత్మ బలిదాన యత్నం..!

అయితే, నిందితుడిని కస్టడీలో తీసుకున్న వెంటనే.. గ్రామస్థులు పోలీసులపై రాళ్లు రువ్వడం ప్రారంభించారు. ఈ దాడిలో ఏఎస్సై సహా తొమ్మిది మంది సిబ్బందికి గాయాలయ్యాయి. వారి వాహనాలనూ ధ్వంసం చేశారు. గాయపడ్డ సిబ్బంది ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు. రాళ్ల దాడిపై కేసు నమోదు చేసి, నిందితులను గుర్తించేందుకు యత్నిస్తున్నట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు