ACB raid: పాస్‌బుక్‌ కావాలా? రూ.5లక్షలు ఇవ్వాలి

రెవెన్యూ శాఖలో అవినీతిని అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. కొందరు అధికారులు మాత్రం తమ చేతివాటం ప్రదర్శిస్తూనే ఉన్నారు. తాజాగా జయశంకర్‌

Updated : 23 Jul 2021 04:24 IST

కాటారం: రెవెన్యూ శాఖలో అవినీతిని అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. కొందరు అధికారులు మాత్రం తమ చేతివాటం ప్రదర్శిస్తూనే ఉన్నారు. తాజాగా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని కాటారం తహశీల్దార్‌ పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటూ గురువారం అవినీతి నిరోధకశాఖ అధికారులకు చిక్కారు.

వివరాల్లోకి వెళితే.. కాటారం మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన అయితా హరికృష్ణ అనే రైతు తన భూమిని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని దరఖాస్తు చేసుకున్నాడు. రోజులు గడిచినా ఆన్‌లైన్‌లో నమోదు చేయకపోవడంతో తహశీల్దార్‌ సునీతను ఆశ్రయించాడు. రూ.5లక్షలు లంచం ఇస్తేనే భూమిని ఆన్‌లైన్‌లో నమోదు చేస్తానని చెప్పడంతో హరికృష్ణ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. తహశీల్దార్‌తో కుదుర్చుకున్న ముందస్తు ఒప్పందం మేరకు తొలి విడతగా రూ.2లక్షలు లంచం ఇస్తుండగా అవినీతి నిరోధకశాఖ అధికారులు తహశీల్దార్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని