Murder: గుంటూరులో యువతి దారుణ హత్య

గుంటూరులో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

Published : 10 Mar 2024 06:54 IST

గుంటూరు: నగరంలోని షాప్‌ ఎంప్లాయీస్ కాలనీ 10వ లైన్‌లో గుర్తుతెలియని యువతి దారుణ హత్యకు గురైంది. పోలీసులు మృతురాలి ఒంటిపై పలుచోట్ల కత్తి పోట్లను గుర్తించారు. సంఘటనా స్థలంలో కత్తి లభ్యమైంది. యువతి హత్యతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పాత గుంటూరు సీఐ రమేశ్‌బాబు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మహిళ శరీరంపై  దుర్గారావు అనే పచ్చబొట్టును గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని