logo

‘టీజీ’ కోడ్‌తో రిజిస్ట్రేషన్లు

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వాహనాల రిజిస్ట్రేషన్‌ కోడ్‌ను ‘టీఎస్‌’ నుంచి ‘టీజీ’కి మార్పు చేస్తూ ఈ నెల 15న గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది.

Updated : 29 Mar 2024 06:26 IST

జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ల కోసం బారులు తీరిన వాహనదారులు

మంచిర్యాల గ్రామీణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వాహనాల రిజిస్ట్రేషన్‌ కోడ్‌ను ‘టీఎస్‌’ నుంచి ‘టీజీ’కి మార్పు చేస్తూ ఈ నెల 15న గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది.  జిల్లా రవాణాశాఖ అధికారులు వాహనాల నెంబర్‌ ప్లేట్లపై టీఎస్‌ స్థానంలో టీజీని మార్చి జిల్లా నెంబర్‌ కోడ్‌లను పాతవాటినే కొనసాగిస్తూ వాహనాల రిజిస్ట్రేషన్లను ప్రారంభించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో ఈ నెల 15 నుంచి టీజీ - 19 కోడ్‌తో నూతన వాహనాలకు రిజిస్ట్రేషన్‌లు చేస్తున్నారు.

టీఎస్‌ కంటే టీజీపై ఆసక్తి...

జిల్లాలో నూతనంగా వాహనాలు కొనుగోలు చేసే వాహనదారులు గతంలోని కోడ్‌ ‘టీఎస్‌’ కంటే తాజాగా ప్రవేశపెట్టిన ‘టీజీ’ కోడ్‌పైనే ఆసక్తి చూపుతున్నారు. దీంతో వాహనాలను కొనుగోలు చేయడంలో ఉత్సాహం చూపుతున్నారు. కోడ్‌ ప్రారంభంలోనే వాహనాలు కొనుగోలు చేస్తే వారికి అనుకూలమైన నెంబర్‌ వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కోడ్‌ను మార్చినందున రిజిస్ట్రేషన్లు పెరిగినప్పటికీ నెంబర్‌ప్లేట్లను పూర్తిస్థాయిలో అందించలేకపోతున్నారు. నూతనంగా మారిన టీజీ కోడ్‌కు సంబంధించిన సాంకేతికతను కంప్యూటర్లలో పూర్తిస్థాయిలో మార్చకపోవడంతో వాహనదారులకు అందించే పత్రాల పంపిణీలో కొంతమేరకు జాప్యం ఏర్పడుతోంది.

ఓ ద్విచక్రవాహనానికి నూతన కోడ్‌ ‘టీజీ-19’ తో అమర్చిన నెంబర్‌ప్లేట్‌


సాంకేతికత పూర్తయితే పూర్తిస్థాయి సేవలు
సంతోష్‌కుమార్‌, జిల్లా రవాణాశాఖ అధికారి, మంచిర్యాల

జిల్లావ్యాప్తంగా నూతనంగా మారిన టీజీ కోడ్‌తోనే అన్ని రకాల వాహనాలకు రిజిస్ట్రేషన్లు చేస్తున్నాం. కోడ్‌ ప్రారంభమైన నాటి నుంచి వెబ్‌సైట్‌లో పూర్తిస్థాయిలో సాంకేతికతను అప్‌డేట్‌ చేయలేదు. దీంతో నూతన కోడ్‌తో అందించే పత్రాల పంపిణీలో జాప్యమవుతోంది. మరో వారం రోజుల్లో కార్డుల పంపిణీ పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నాం. గతంలో మాదిరిగానే వాహనాల రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నప్పటికీ ఇబ్బందులు లేకుండా వాహనదారులకు సేవలందేలా కృషిచేస్తున్నాం.

జిల్లాలో ఈ నెల 27 నాటికి ‘టీజీ’ కోడ్‌తో రిజిస్ట్రేషన్‌ చేసిన వాహనాల వివరాలివే...

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని