logo

భారాసతోనే రాష్ట్రానికి మేలు

భారాసతోనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని ఆ పార్టీ సీనియర్‌ నాయకులు, మాజీ నెడ్‌క్యాప్‌ డైరెక్టర్‌ చిలుకూరి భూమయ్య అన్నారు.

Updated : 05 May 2024 06:54 IST

ఆదిలాబాద్‌లో ప్రచారం చేస్తున్న పురపాలక అధ్యక్షుడు ప్రేమేందర్‌, భారాస నాయకులు

బజార్‌హత్నూర్‌, న్యూస్‌టుడే : భారాసతోనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని ఆ పార్టీ సీనియర్‌ నాయకులు, మాజీ నెడ్‌క్యాప్‌ డైరెక్టర్‌ చిలుకూరి భూమయ్య అన్నారు. మండలంలోని వర్తమన్నూర్‌, ఎల్లయ్యపల్లె, పిప్పిరి గ్రామాల్లో శనివారం ప్రచారం నిర్వహించారు.

బోథ్‌: భారాస నాయకులు సురేందర్‌ యాదవ్‌, రాజు, సుభాష్‌, ప్రశాంత్‌, రమణగౌడ్‌, ప్రవీణ్‌, సత్యనారాయణ, రఫీ, వినయ్‌ బోథ్‌లో ప్రచారం చేశారు.  

నేరడిగొండ: తెలంగాణ వాదాన్ని భారాసతోనే నెరవేర్చుకోవచ్చని ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌ అన్నారు. మండలంలోని బోరిగాంలో ఇంటింటికి తిరిగి రాష్ట్రంలో భారాస ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.

 ఉట్నూరు గ్రామీణం: ఉట్నూరు ఎంపీపీ పంద్ర జైవంత్‌రావు లక్కారంలో ఉపాధి కూలీలను కలిసి భారాసకు ఓటేయాలని కోరారు. చికెన్‌ సెంటర్‌లో చికెన్‌ కొడుతూ ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఇంద్రవెల్లి : ధనోర(బి) మాజీ సర్పంచి ఏర్మా జాకేశ్‌, ఉప సర్పంచి సంతోష్‌ మహరాజ్‌లతో పాటు నాయకులు ప్రచారంలో పాల్గొన్నారు.

 ఆదిలాబాద్‌ పట్టణం : కాంగ్రెస్‌, భాజపాలకు ఓటు వేస్తే వృథా అవుతుందని ఆదిలాబాద్‌ పురపాలక ఛైర్మన్‌ జోగు ప్రేమేందర్‌ అన్నారు. పార్లమెంటులో ప్రజల గళం వినిపించాలంటే భారాస అభ్యర్థి ఆత్రం సక్కునే గెలిపించాలని కోరారు. పట్టణంలోని కేఆర్‌కే కాలనీలో శనివారం ఆయన ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. నాయకులు రమేష్‌, భరత్‌, రవి, గంగన్న, భూమన్న, వినోద్‌, మహిళా విభాగం అధ్యక్ష, కార్యదర్శులు స్వరూపరాణి, మమత తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని