logo

మద్యం కోసమే చంపేశారు!

అరకులోయ గిరిజన మ్యూజియం వద్ద జరిగిన హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. సీఐ దేముడుబాబు కథనం ప్రకారం... జూన్‌ 29న స్థానిక గిరిజన మ్యూజియం ఆవరణలో గుర్తుతెలియని మృతదేహం పడి ఉన్నట్లు

Published : 03 Jul 2022 02:29 IST

ఒడిశావాసి హత్య కేసులో ముగ్గురి అరెస్టు


కేసు వివరాలు చెబుతున్న సీఐ దేముడుబాబు

అరకులోయ, న్యూస్‌టుడే: అరకులోయ గిరిజన మ్యూజియం వద్ద జరిగిన హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. సీఐ దేముడుబాబు కథనం ప్రకారం... జూన్‌ 29న స్థానిక గిరిజన మ్యూజియం ఆవరణలో గుర్తుతెలియని మృతదేహం పడి ఉన్నట్లు అందిన సమాచారం మేరకు డాగ్‌ స్క్వాడ్‌, క్లూస్‌ టీంతో దర్యాప్తు చేశారు. విచారణలో హత్యకి గురైన వ్యక్తి ఒడిశాకు చెందిన రమణ (33)గా గుర్తించారు. కేసుకు సంబంధించి ప్రత్యేక బృందాలతో దర్యాప్తు నిర్వహించగా ముగ్గురు వ్యక్తులు ఈ హత్యకు పాల్పడినట్లు తేలింది. వీరిలో ఇద్దరు మైనర్లు ఉన్నారు. నిందితులు ముగ్గురూ మద్యం, గంజాయికి అలవాటు పడి మత్తులో హత్యచేసినట్లు అంగీకరించారు. అరకులోయకి చెందిన సూరుపత్తి నర్సులుతో పాటు మరో ఇద్దరు మైనర్లు గతనెల 28వ తేదీ రాత్రి 12 గంటల సమయంలో మ్యూజియం ఆవరణలో మద్యం తాగుతున్న రమణని తమకు కూడా ఇవ్వాలని కోరారు. అందుకు రమణ నిరాకరించటంతో కోపంతో ముగ్గురూ కలిసి బండరాయితో ముఖంపై కొట్టి చంపేశారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఉన్న మద్యం దుకాణం వెనుకభాగంలోని కిటికీ తొలగించి దుకాణంలో మద్యంతో పాటు ట్యాబ్‌ని దొంగిలించారు. నిందితులను శనివారం అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన సిబ్బందిని సీఐ అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని