logo

కేంద్ర బడ్జెట్‌లో పోలవరం ఊసేది?

కేంద్ర బడ్జెట్‌లో జాతీయ ప్రాజెక్టు పోలవరానికి నిధులు కేటాయించకపోవడం అన్యాయమని సీపీఎం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్‌ అన్నారు.

Updated : 03 Feb 2023 06:00 IST

ఎటపాకలో మాట్లాడుతున్న సీపీఎం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్‌

ఎటపాక, న్యూస్‌టుడే: కేంద్ర బడ్జెట్‌లో జాతీయ ప్రాజెక్టు పోలవరానికి నిధులు కేటాయించకపోవడం అన్యాయమని సీపీఎం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్‌ అన్నారు. ఎటపాకలో పార్టీ నాయకులతో గురువారం మండల కమిటీ సభ్యురాలు పద్మ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం, పునరావాసం కల్పించేందుకు నిధులు ప్రకటించకపోవడం బాధాకరమన్నారు. 25 మంది ఎంపీలను ఇస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా, నిధులు వస్తాయని చెప్పిన ముఖ్యమంత్రి.. ఇప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు మర్లపాటి నాగేశ్వరరావు, మండల కార్యదర్శి ఇసంపల్లి వెంకటేశ్వర్లు, మాధవరావు, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


కూనవరం, న్యూస్‌టుడే: పోలవరం నిర్వాసితులకు నిధులు కేటాయించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు మేకల నాగేశ్వరరావు కోరారు. పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లోపాయికారి ఒప్పందాలు చేసుకుని నిర్వాసితులకు అన్యాయం చేస్తున్నాయన్నారు. పెంటయ్య, రామారావు, వెంకమ్మ, అమ్మాజీ, సీతారామయ్య పాల్గొన్నారు.


నిధులు తేవడంలో విఫలం

రంపచోడవరం, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించకపోవడం అన్యాయమని మాజీ ఎమ్మెల్యే శీతంశెట్టి వెంకటేశ్వరరావు అన్నారు. గురువారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. విభజన చట్టం ప్రకారం పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారన్నారు. తెదేపా హయాంలో 72 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పారు. జాతీయ ప్రాజెక్టుకు తప్పనిసరిగా కేంద్రమే నిధులు ఇవ్వాల్సి ఉందన్నారు. నిధులు రాబట్టడంతో వైకాపా ఎంపీలు విఫలమయ్యారని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని