logo

పదిపరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

జిల్లావ్యాప్తంగా ఏప్రిల్‌ మూడో తేదీ నుంచి పది పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ పేర్కొన్నారు.

Published : 21 Mar 2023 01:20 IST

పాడేరు, న్యూస్‌టుడే: జిల్లావ్యాప్తంగా ఏప్రిల్‌ మూడో తేదీ నుంచి పది పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ పేర్కొన్నారు. పరీక్షల ఏర్పాట్లపై కలెక్టరేట్‌ నుంచి సోమవారం డీఈఓ సలీమ్‌ బాషాతో కలిసి అధికారులతో జూమ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఎస్పీ సతీష్‌కుమార్‌, పాడేరు, రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు గోపాలకృష్ణ, సూరజ్‌ గనోరే కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ పలు సూచనలు చేశారు. జిల్లాలోని 63 కేంద్రాల్లో విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎంఈవోలు ఆయా పాఠశాలల్లో సమావేశాలు నిర్వహించి తగు సూచనలివ్వాలన్నారు. అనంతగిరి, కొయ్యూరు, గూడెంకొత్తవీధిలో తరచూ విద్యుత్తు అంతరాయం ఏర్పడుతోందని, సరిదిద్దాలని సూచించారు. కేంద్రాలకు పరీక్ష పత్రాలను తరలించేందుకు తగు భద్రత కల్పించాలని ఎస్పీ సతీష్‌కుమార్‌కు సూచించారు. జిల్లావ్యాప్తంగా 11,522 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారని చెప్పారు. జిల్లా వైద్యాధికారి జమాల్‌ బాషా, గిరిజన సంక్షేమశాఖ డీడీ కొండలరావు, ఆర్టీసీ డీఎం, ఏపీఈపీడీసీఎల్‌ ఇంజినీర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని