logo

భార్య హత్య కేసులో జీవిత ఖైదు

భార్యను హతమార్చిన భర్తకు జీవితకాల కారాగార శిక్ష విధిస్తూ విశాఖపట్నం మహిళా కోర్టు ఆరో అదనపు జిల్లా జడ్జి సువర్ణరాజు తీర్పు ఇచ్చారు.

Published : 30 May 2023 03:21 IST

నిందితుడు శివప్రసాద్‌

జి.మాడుగుల, న్యూస్‌టుడే: భార్యను హతమార్చిన భర్తకు జీవితకాల కారాగార శిక్ష విధిస్తూ విశాఖపట్నం మహిళా కోర్టు ఆరో అదనపు జిల్లా జడ్జి సువర్ణరాజు తీర్పు ఇచ్చారు. జి.మాడుగుల ఎస్సై శ్రీనివాసరావు సోమవారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జి.మాడుగుల మండలం కుంబిడిసింగి పంచాయతీ ఉర్లమెట్ట గ్రామానికి చెందిన భానుమతి వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఆమె భర్త సోమెలి శివప్రసాద్‌ 2021 సంవత్సరం ఆగస్టులో ఆమెను కత్తితో నరికి చంపాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. హత్యకు సంబంధించి ముఖ్యమైన ఆధారాలు సేకరించి కోర్టులో హాజరుపర్చారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి నిందితుడికి జీవిత ఖైదు శిక్షతోపాటు రూ. 1000 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.


రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడి మృతి

అరుగుల ప్రసాద్‌ (పాత చిత్రం)

కోరుకొండ, న్యూస్‌టుడే: తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ-బూరుగుపూడి గేటు మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న ఓ యువకుడు మృతిచెందాడు. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 18వ తేదీన రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న సంఘటనలో పూర్ణిమ అనే యువతి అక్కడికక్కడే మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇదే ఘటనలో తీవ్రంగా గాయపడి రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అరుగుల ప్రసాద్‌(28) సోమవారం మృతిచెందాడు. దీంతో స్వగ్రామం కోరుకొండ మండలం పశ్చిమగోనగూడెంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఇతడు రంపచోడవరంలోని సచివాలయంలో విధులు నిర్వహిస్తున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు