logo

అటవీ హక్కుల చట్టానికి కేంద్రం తూట్లు: సీతారాం ఏచూరి

దేశంలో లౌకికవాదం బతకాలంటే మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు.

Published : 10 May 2024 01:57 IST

బహిరంగ సభలో మాట్లాడుతున్న సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి

కూనవరం, న్యూస్‌టుడే: దేశంలో లౌకికవాదం బతకాలంటే మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కూనవరంలో గురువారం సాయంత్రం నిర్వహించిన ఇండియా కూటమి బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. దేశాన్ని నడుపుతున్న నాలుగు ప్రధాన స్తంభాలపై భాజపా ప్రభుత్వం తీవ్రమైన దాడులు చేస్తోందన్నారు. మోదీ మాట వినకపోవడం వల్లనే దిల్లీ, ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రులను కారాగారంలో పెట్టారన్నారు. సీపీఎం పోరాటాల ద్వారా అప్పటి యూపీఏ ప్రభుతం ద్వారా తీసుకొచ్చిన అటవీహక్కుల చట్టానికి తన మిత్రుల అక్రమ మైనింగ్‌ల కోసం తూట్లు పొడుస్తున్నారన్నారు. రాజ్యాంగ రద్దు ద్వారా దళిత, గిరిజనులకు అన్యాయం చేయడానికే మోదీ ఈ ఎన్నికల్లో 400 సీట్లు కోరుతున్నారని విమర్శించారు. మోదీని గద్దె దింపాలంటే ఇండియా కూటమి బలపర్చిన సీపీఎం ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. తెలంగాణ రాష్ట్రం కొత్తగూడెం సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, ఛత్తీస్‌గఢ్‌ ఎమ్మెల్యే లక్మాలు మాట్లాడారు. నియోజకవర్గంలోని 11 మండలాల నుంచి వేలాదిగా కార్యకర్తలు తరలివచ్చారు. ముందుగా వీఆర్‌పురం నుంచి కూనవరం వరకు ప్రదర్శన చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని