logo

ఆక్రమణల చెరలో వీఎంసీ స్థలం

చుట్టుగుంట అల్లూరి సీతారామరాజు వంతెనకు వెళ్లే మార్గంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ భవనం ప్రహరీ గోడకు ఆనుకొని నగరపాలక సంస్థకు చెందిన సుమారు 45 గజాల స్థలం ఉంది.

Published : 09 Dec 2022 06:04 IST

డివిజన్‌ వైకాపా సమన్వయకర్త కన్ను

చుట్టుగుంట సిమెంట్‌ రోడ్డులో ప్రహరీ పక్కనే ఆక్రమణ

చుట్టుగుంట, న్యూస్‌టుడే : చుట్టుగుంట అల్లూరి సీతారామరాజు వంతెనకు వెళ్లే మార్గంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ భవనం ప్రహరీ గోడకు ఆనుకొని నగరపాలక సంస్థకు చెందిన సుమారు 45 గజాల స్థలం ఉంది. దీని విలువ సుమారు రూ.60 లక్షలు ఉంటుంది. దీనిపై 26వ డివిజన్‌ వైకాపా సమన్వయకర్త కన్ను పడింది. ఎప్పటి నుంచో ఈ స్థలంపై కన్నేసిన ఆయన.. కరోనా సమయంలో దాన్ని సొంతం చేసుకునేందుకు యత్నించారు. తొలుత.. కొవిడ్‌ సమయంలో లైవ్‌ ఫిష్‌ తొట్టెలను పెట్టి అమ్మకాలు సాగించారు. ప్రస్తుతం రోడ్డు పక్కనే ఉన్న డ్రైనేజీపై శ్లాబు బిళ్లలు వేసి, ఆ స్థలంలో నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. గత కొద్ది నెలలుగా టార్పాలిన్‌ పట్టాలతో కప్పి ఉంచి, భారీ కట్టడానికి తెరతీశారు. చుట్టుగుంట కూడలికి కూతవేటు దూరంలో ఉన్న ఈ స్థలం.. భారీగా ధర పలుకుతోంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ భవనం ప్రాంగణం రోడ్డు పక్కనే నిరుపేదలు కూరగాయలు అమ్ముకునేందుకు అవకాశం కల్పించగా.. అక్కడా ఆయనకు చెందిన పలు దుకాణాలు ఉన్నాయని విమర్శలు ఉన్నాయి. దీనిపై అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌ బాలాజీని వివరణ కోరగా... ‘క్షేత్రస్థాయిలో సంబంధిత స్థలాన్ని పరిశీలించి, తగు చర్యలు తీసుకుంటానని చెప్పారు.’

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని