వీరు ఏమయ్యారు?
కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాద ఘటనలో విజయవాడ వరకు రిజర్వేషన్ చేయించుకున్న వారిలో స్వల్ప గాయాలతో కొందరు, సురక్షితంగా ఎక్కువ మంది బయటపడ్డారు.
అయిదుగురి ఫోన్లు స్విచ్ఛాఫ్
ఎనిమిది మంది స్పందించలేదు
రైల్వే స్టేషన్ సహాయ కేంద్రంలో వివరాలు ఆరా తీస్తున్న సిబ్బంది
ఈనాడు - అమరావతి, న్యూస్‌టుడే - విజయవాడ సిటీ: కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాద ఘటనలో విజయవాడ వరకు రిజర్వేషన్ చేయించుకున్న వారిలో స్వల్ప గాయాలతో కొందరు, సురక్షితంగా ఎక్కువ మంది బయటపడ్డారు. ఇక్కడి వరకు మొదటి, ద్వితీయ, తృతీయ ఏసీ, స్లీపర్ కోచ్‌ల్లో మొత్తం 39 మంది ప్రయాణించారు. వీరిలో 13 మంది పరిస్థితి తెలియరాలేదు. అయిదుగురి ఫోన్లు స్విచ్ఛాఫ్ అయ్యాయి. ఎనిమిది మంది ప్రయాణికుల ఫోన్లు మోగుతున్నా ఎవరూ స్పందించడం లేదు. వీరు మరణించారా? లేక ప్రాణాలతో ఉన్నారా? అన్నది ఇంకా ఇతిమిత్థంగా తెలియరాలేదు. ఇద్దరి ఫోన్ నంబర్లు అందుబాటులో లేవు. మిగిలిన వారిలో పది మందే తెలుగు ప్రయాణికులు. ఇందులో విజయవాడ నగరానికి చెందిన వారు నలుగురు, గుంటూరు జిల్లా వారు ఇద్దరు, కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం.. ఇద్దరు కాగా.. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు చెందిన వారు ఇద్దరు ఉన్నారు. 14 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు. విజయవాడకు రిజర్వేషన్ చేయించుకున్న ఇతర రాష్ట్రాల వారిలో ఎక్కువ మంది ఇక్కడ దిగి వేరే రైలు అందుకోవాల్సిన వారే ఉన్నారు. ప్రాణాలతో బయటపడిన వారిని రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్ల ద్వారా తరలించారు. మరికొందరు తమ సొంత ఏర్పాట్లతో సొంతూళ్లకు చేరుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Mexico: మెక్సికోలో ట్రక్కు బోల్తా: 10 మంది వలసవాదులు మృతి
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/10/23)
-
Rathika Rose: రతికా రోజ్ ఎలిమినేట్.. బద్దలైన యువ హృదయాలు..
-
Siddu Jonnalagadda: ఆ దర్శకుడికి రావాల్సినంత గుర్తింపు రాలేదనిపించింది: సిద్ధు జొన్నలగడ్డ
-
interesting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
ముగిసిన ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు.. కనువిందుగా కళాకారుల ప్రదర్శనలు