logo

కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో.. మహోన్నత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ : బుద్ధప్రసాద్‌

కూటమి ప్రుభుత్వం ఏర్పాటుతో ఆంధ్ర ప్రదేశ్‌ మహోన్నత రాష్ట్రంగా రూపొందుతుందని మాజీ ఉపసబాపతి మండలి బుద్ధప్రసాద్‌ చెప్పారు.

Published : 30 Apr 2024 06:29 IST

ప్రసంగిస్తున్న మండలి

అవనిగడ్డ, న్యూస్‌టుడే: కూటమి ప్రుభుత్వం ఏర్పాటుతో ఆంధ్ర ప్రదేశ్‌ మహోన్నత రాష్ట్రంగా రూపొందుతుందని మాజీ ఉపసబాపతి మండలి బుద్ధప్రసాద్‌ చెప్పారు. తెలుగు జాతి చరిత్రకు పుట్టినిల్లు దివిసీమ అని, దివిసీమకు ప్రాతినిధ్యంవహించడం ఎంతో గర్వంగా ఉందని ఆయన చెప్పారు. సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన అవనిగడ్డ, పిఠాపురం ప్రాంత హైదరాబాద్‌వాసుల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పవన్‌ కల్యాణ్‌ రాజకీయ పదవుల కోసం ఆశించడం లేదన్నారు. దివిసీమకు దేశ చరిత్రలో ప్రముఖ స్థానం ఉందన్నారు. జాతీయ పతాక రూపకల్పన చేసిన పింగళి వెంకయ్య, జెండా వీరుడు తోట నరసయ్యనాయుడు దివిసీమ వాసులన్నారు. రాజకీయ చైతన్యవంతమైన ప్రాంతం దివిసీమ అన్నారు. సనకా బుచ్చికోటయ్య, చండ్ర రామలింగయ్య, చల్లపల్లి రాజా యార్లగడ్డ శివరామప్రసాద్‌, మండలి వెంకటకృష్ణారావు, సింహాద్రి సత్యనారాయణరావు, అంబటి బ్రాహ్మణయ్య వంటి హేమాహేమీలు అవనిగడ్డ నుంచి ప్రజాప్రతినిధులుగా పనిచేశారన్నారు. మూడుసార్లు తను దివిసీమకు ప్రాతినిధ్యం వహించడం అదృష్టంగా భావిస్తానని చెప్పారు. అయిదేళ్లుగా అభివృద్ధి కుంటుపడిందన్నారు. తన హయాంలో చేసిన అభివృద్ధిని వివరించారు. మూడు పార్టీల కలయిక రాష్ట్రాబివృద్ధి, ప్రజా సంక్షేమం, ప్రజల రక్షణ కోసమేనని చెప్పారు. నియోజకవర్గంలో వైకాపా ఖాళీ అయిందన్నారు. పిఠాపురంలో పవన్‌కల్యాణ్‌ విజయం ఖాయమన్నారు. రాష్ట్రానికి మంచి రోజులు రావాలని, అందుకోసం ఓటర్లు కూటమికి అధికారం ఇవ్వాలని కోరారు. మండలి వెంకట్రామ్‌, ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్‌, బొండాడ రాఘవేంద్రరావు, దేవరకొండ ప్రసాద్‌, తలశిల ప్రభాకర్‌, గుమ్మడి గోపాలకృష్ణ, అన్నపరెడ్డి వెంకటస్వామి, పిన్నమనేని శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని