logo

బంగారం ఆశ చూపి..రూ.10లక్షలతో ఉడాయింపు

తక్కువ ధరకే బంగారు నాణేలు ఇస్తామని నమ్మబలికి రూ.10 లక్షల డబ్బుతో దొంగల ముఠా ఉడాయించిన ఘటన శుక్రవారం నగర శివారులో చోటు చేసుకుంది. అనంత గ్రామీణం సీఐ మురళీధర్‌ రెడ్డి తెలిపిన వివరాల మేరకు.

Published : 15 Jan 2022 05:50 IST

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: తక్కువ ధరకే బంగారు నాణేలు ఇస్తామని నమ్మబలికి రూ.10 లక్షల డబ్బుతో దొంగల ముఠా ఉడాయించిన ఘటన శుక్రవారం నగర శివారులో చోటు చేసుకుంది. అనంత గ్రామీణం సీఐ మురళీధర్‌ రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా బాజాకుంట గ్రామానికి చెందిన పరమేశ్‌కు కొద్ది రోజుల కిందట కర్ణాటక రాష్ట్రానికి చెందిన కొందరు వ్యక్తులు ఫోన్‌ చేశారు. తమ వద్ద అసలైన బంగారం ఉందని, తక్కువ ధరకు ఇస్తామని నమ్మబలికారు. వారి మాటలు నమ్మిన బాధితుడు బంగారం కొనడానికి ఒప్పుకున్నాడు. ఎక్కడికి రావాలని అడిగాడు. అనంతపురం నగర శివారులోకి రావాలని చెప్పారు. దీంతో శుక్రవారం బాధితుడు పరమేశ్‌ నల్గొండ నుంచి అనంతపురం నగర సమీపంలోని కురుగుంట వైఎస్సార్‌ కాలనీ వద్దకు వెళ్లాడు. అక్కడికి కర్ణాటకకు చెందిన ముగ్గురు ముఠా సభ్యులు ద్విచక్ర వాహనంలో నకిలీ బంగారం నాణేలతో వచ్చారు. మాటామాట కలిపి నాణేలను ఇచ్చి, రూ.10 లక్షలు తీసుకుని ఉడాయించారు. అనంతరం అనుమానం వచ్చి నాణేలను పరీక్ష చేయించగా అవి నకిలీవని తేలడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని