logo

అంజన్న వైభవం

కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం స్వామి మూలవిరాట్టును వివిధ రకాల పండ్లతో విశేషంగా అలంకరించారు. హోమాలు, అభిషేకాలు చేశారు. సాయంత్రం ముఖ మండపంలో ఆంజనేయస్వామి ఉత్సవమూర్తికి మ

Published : 25 May 2022 04:49 IST


పూలతో స్వామికి లక్షార్చన నిర్వహిస్తున్న అర్చకులు

గుంతకల్లు గ్రామీణం, న్యూస్‌టుడే: కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం స్వామి మూలవిరాట్టును వివిధ రకాల పండ్లతో విశేషంగా అలంకరించారు. హోమాలు, అభిషేకాలు చేశారు. సాయంత్రం ముఖ మండపంలో ఆంజనేయస్వామి ఉత్సవమూర్తికి మల్లె పూలతో లక్షార్చన కార్యక్రమం నిర్వహించారు.

నేడు హనుమజ్జయంతి: హనుమజ్జయంతి సందర్భంగా బుధవారం స్వామికి విశేష పుష్పాలంకరణ, తోమాల సేవ, స్వర్ణ వజ్రకవచ అలంకరణ చేయనున్నారు. ఉదయం 9 నుంచి సీతారామచంద్ర పట్టాభిషేకం, సాయంత్రం 6కు ఒంటె వాహనంపై ప్రాకారోత్సవం ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని